News July 22, 2024

పాలేరుకు చేరిన నాగార్జున సాగర్ జలాలు

image

నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా శనివారం నీరు విడుదల చేయగా ఆదివారం సాయంత్రం పాలేరు రిజర్వాయర్‌కు చేరాయి. ప్రస్తుతం 1,100 క్యూసెక్కుల నీరు చేరుతుండగా అది క్రమంగా 3వేల క్యూసెక్కులకు చేరనుంది. రిజర్వాయర్‌కు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయనుండగా.. నాలుగు రోజుల పాటు నీటి సరఫరా కొనసాగుతోంది. రిజర్వాయర్ నీటిమట్టం ఆదివారానికి 5.55 అడుగులకు పడిపోగా సాగర్ జలాల చేరికతో క్రమంగా పెరుగుతోంది.

Similar News

News October 9, 2024

గతంలో మధ్యాహ్న భోజన నిధులు కూడా ఇవ్వలేదు: డిప్యూటీ సీఎం భట్టి

image

ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పెండింగ్ లో ఉన్న కాస్మోటిక్, స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేసినట్లు భట్టి పేర్కొన్నారు. గత ప్రభుత్వం అన్ని బిల్లులను పెండింగ్లోనే పెట్టిందన్నారు. కనీసం మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా నిధులు విడుదల చేయలేదన్నారు. ఇక నుంచి ఏ నెల బిల్లు ఆనెలలోనే విడుదల అవుతాయని డిప్యూటీ సీఎం ఖమ్మంలో స్పష్టం చేశారు.

News October 8, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 4 రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. 10న దుర్గాష్టమి పండుగ, 11న మహర్నవమి పండుగ, 12న విజయదశమి పండుగ, 13న ఆదివారం సందర్భంగా సెలవులిస్తున్నట్లు చెప్పారు. తిరిగి ఈనెల 14వ తేదీ సోమవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.

News October 8, 2024

సింగరేణి కార్మికులకు దసరా విందు ఏర్పాటు చెయ్యండి: డిప్యూటీ సీఎం భట్టి

image

సింగరేణి కార్మికులకు దసరా పండుగ సందర్భంగా విందు ఏర్పాటు చేయాలని డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఉద్యోగులకు బోనస్ అందజేశామని, సింగరేణిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్ కార్యక్రమాలను ఎల్ఈడీ తెరల ద్వారా తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.