News July 8, 2024

పాల్వంచలో టిఫిన్ చేస్తుండగా గుండెపోటుతో మృతి

image

టిఫిన్ చేస్తున్న ఓ వ్యక్తికి గుండెపోటు రాగా
ఆస్పత్రికి తరలించే లోగా మృతి చెందాడు. పోలీసుల వివరాలిలా.. పాల్వంచలోని టీచర్స్ కాలనీకి చెందిన వెంకటలక్ష్మీనారాయణ ఆదివారం ఇంట్లో టిఫిన్ చేస్తూ ఒక్కసారిగా ఛాతీనొప్పితో కుప్పకూలాడు. అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై బి.రాము కేసు నమోదు చేశారు.

Similar News

News February 19, 2026

ధరణి వెనుక ‘పెద్ద’ కుట్ర.. డొంక కదిలింది: పొంగులేటి

image

ధరణి పోర్టల్ వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల అసలు రంగు బయటపడుతోందని మంత్రి పొంగులేటి ధ్వజమెత్తారు. సచివాలయంలో ధరణిపై నియమించిన ఉన్నత స్థాయి కమిటీతో ఆయన సమీక్షించారు. “తీగ లాగితే డొంక కదిలినట్లు” అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయన్నారు. గత పాలకుల స్వార్థ ప్రయోజనాల కోసం పోర్టల్‌లోని లొసుగులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కొల్లగొట్టారని ఆరోపించారు.

News February 18, 2026

ఖమ్మంలో సదరం శిబిరం ఏర్పాట్లపై ఆరా

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని సదరం (SADAREM) బ్లాక్‌ను అడిషనల్ కలెక్టర్ శ్రీజ బుధవారం పరిశీలించారు. రాబోయే శిబిరం కోసం జరుగుతున్న సివిల్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్నపాటి మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని, శిబిరానికి వచ్చే దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

News February 18, 2026

జిల్లాలో భూసేకరణ వేగవంతం చేయాలి: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో నేషనల్ హైవే ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. ధంసలాపురం ఎంట్రీ, ఎగ్జిట్‌కు 1.38 ఎకరాల భూసేకరణ త్వరగా పూర్తి చేసి మార్చి 15లోపు పనులు ముగించాలని ఆదేశించారు. నాగపూర్- అమరావతి హైవే ప్యాకేజీలకు కొనిజర్ల, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో భూ స్వాధీనం వేగవంతం చేయాలన్నారు. 17 జంక్షన్ల రోడ్డు భద్రతా పనులు నెలాఖరుకు పూర్తి చేయాలని సూచించారు.