News October 11, 2025
పాల్వంచలో మరో థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందడుగు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో మరో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందడుగు పడింది. కొత్తగా ఒకటి లేదా రెండు ప్లాంట్ల ఏర్పాటుపై నివేదిక తయారు చేయాలని జెన్‌కో యాజమాన్యం శుక్రవారం ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించింది. 800 మెగావాట్ల సామర్థ్యంతో అల్ట్రా సూపర్ క్రిటికల్ విధానంలో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది.
Similar News
News October 11, 2025
జీఎస్టీ 2.0: పాత ధరలకు అమ్మితే చర్యలు: కలెక్టర్

జీఎస్టీ 2.0 ప్రయోజనాలు ప్రజలకు చేరాలని, పాత జీఎస్టీ ధరలకు విక్రయించే వర్తకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల కోసం జిల్లా స్థాయిలో 8712631283 నంబర్‌తో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 8712631279 నంబర్ అందుబాటులో ఉందని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News October 11, 2025
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: MHBD SP

మహబూబాబాద్ జిల్లా ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ అన్నారు. సోషల్ మీడియా, మ్యాట్రిమోనియల్ సైట్లలో వివాహ వాగ్దానాల పేరుతో పెట్టుబడి మోసాలు, డిజిటల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌ను నమ్మవద్దన్నారు. సైబర్ నేరాల బారిన పడినవారు 1930, డయల్ 100, సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
News October 11, 2025
లింగపాలెంలో బొగ్గు గనులకు గ్రీన్ సిగ్నల్

లింగపాలెం మండలంలో బొగ్గు గనుల తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 27వ తేదీతో టెండర్ ప్రక్రియ గడువు ముగుస్తుందని, నవంబర్ నెలాఖరుకు వేలం పూర్తవుతుందని అధికారులు శనివారం తెలిపారు. తవ్వకాలు మొదలైతే ఈ ప్రాంతం మొత్తం ‘ఆంధ్ర సింగరేణి’గా మారుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.