News November 24, 2025
పాల్వంచ: అధికారుల కృషి ఫలితంగా జాతీయ స్థాయి అవార్డు

‘జల్ సంచయ్-జన్ భాగీదారీ’ జాతీయ స్థాయిలో మూడో జోన్‌కు చెందిన కేటగిరీ-3లో రాష్ట్రంలో మొదటి స్థానాన్ని సాధించింది. విశిష్ట ఫలితానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం రూ.25 లక్షల నగదు బహుమతిని ప్రకటించిన సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సోమవారం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొని మాట్లాడారు. అధికారుల కృషి ఫలితంగా అవార్డు వచ్చిందన్నారు.
Similar News
News November 25, 2025
అతి సన్నని వరి వంగడం త్వరలో విడుదల

సన్న వరి రకాలకు డిమాండ్ దృష్ట్యా, అత్యంత నాణ్యత గల అతి సన్నని వరి వంగడం ‘MTU 1426’ను మార్టేరు వరి పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసింది. ఇది రబీకి అనుకూలం. పంటకాలం 125 రోజులు. కాండం దృఢంగా ఉండి, చేనుపై పడిపోదు. దిగుబడి హెక్టారుకు 6.5- 7 టన్నులు. ఇది తొలి ఏడాది చిరు సంచుల ప్రదర్శనలో మంచి ఫలితాలనిచ్చింది. మరో 2 ఏళ్లు పరిశీలించి ఫలితాల ఆధారంగా విడుదల చేస్తారు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News November 25, 2025
విషతుల్యమవుతున్న తల్లిపాలు

తల్లిపాలు స్వచ్ఛమైనవి, కల్తీలేనివని మనం అనుకుంటాం. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల తల్లి పాలల్లో మైక్రోప్లాస్టిక్ అవశేషాలున్నట్లు గతంలో పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే తాజాగా బిహార్‌లో చేసిన ఓ పరిశోధనలో తల్లిపాలలో యురేనియం అవశేషాలున్నట్లు గుర్తించారు. ఇవన్నీ ఇలాగే కొనసాగితే మానవ మనుగడే కష్టం అంటున్నారు నిపుణులు. ఇప్పటికైనా మేలుకొని పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
News November 25, 2025
భూపాలపల్లి: పంచాయతీ ఎన్నికలపై పార్టీల ఫోకస్!

జిల్లాలో 248 పంచాయతీలకు మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ గుర్తులు లేకుండా జరుగుతున్నప్పటికీ, తమ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలుపొందేలా ప్రధాన పార్టీల నాయకులు దృష్టి సారించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పంచాయతీ పోరును పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సర్పంచ్ అభ్యర్థులపై నియోజకవర్గ స్థాయి నాయకులు ఆరా తీస్తున్నారు.


