News October 22, 2025
పాల్వంచ: ఈనెల 24న జాబ్ మేళా..

పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. టెక్నీషియన్, ట్రైనీ టెక్నీషియన్ పోస్టుల కోసం ఏదైనా డిగ్రీ లేదా ఐటీఐ చేసిన వారు అర్హులని చెప్పారు. 18 నుంచి 23 ఏళ్ల లోపు యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. విద్యా అర్హత పత్రాలతో ఈనెల 24న ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలని పేర్కొన్నారు.
Similar News
News October 22, 2025
కొత్త దర్శకుల విజయం: వినూత్న కథాంశాలే బలం!

వినూత్న కథలతో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంలో యువ డైరెక్టర్లు సఫలమవుతున్నారు. సూపర్ హీరో జోనర్ ‘హనుమాన్’తో భారీ విజయం పొందారు ప్రశాంత్ వర్మ. HIT 1&2తో క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్‌తో శైలేష్ కొలను అదరగొట్టారు. అరిషడ్వర్గాలు అనే మైథలాజికల్ అంశంపై సస్పెన్స్ థ్రిల్లర్ ‘అరి’ మూవీతో మెప్పించారు డైరెక్టర్ జయశంకర్. 96, సత్యంసుందరంతో తమిళ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెలుగువాళ్లకు దగ్గరయ్యారు.
News October 22, 2025
మీ డబ్బు-మీ హక్కు పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

మీ డబ్బు-మీ హక్కు అనే నినాదంతో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 నెలల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. బుధవారం నంద్యాల కలెక్టర్ ఛాంబర్‌లో “మీ డబ్బు-మీ హక్కు” అనే గోడ పత్రికను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా పౌరులు తమ పేర్లపై ఉన్న క్లెయిమ్ చేయని లేదా మరచిపోయిన ఆర్థిక ఆస్తులను తిరిగి పొందే అవకాశం కల్పించబడుతోందన్నారు.
News October 22, 2025
వేములవాడ: ‘ప్రభుత్వ ఆసుపత్రిల్లో ప్రసవాలు పెంచాలి’

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. వేములవాడ మండలం రుద్రవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణీలను ఎప్పటికప్పుడు గుర్తించి రికార్డులలో నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది విక్రమ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.