News October 14, 2025
పాల్వంచ: ఐదుసార్లు ఎమ్మెల్యే.. అయినా క్యూలో

ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే మంది మార్బలం, హంగు ఆర్భాటాలతో నానా హంగామా చేస్తుంటారు కొందరు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సాదాసీదా ఉండడమే ఇల్లందు మాజీ ఎమ్మెల్యే నర్సయ్య నైజం. బస్సులో అసెంబ్లీకి వెళ్లిన ఆయన సింప్లిసిటీ అందరికీ తెలిసిందే. తాజాగా కంటి పరీక్షల కోసం పాల్వంచ ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రికి సైకిల్‌పై వెళ్లడం, ఓపీ క్యూలో నిలబడడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Similar News
News October 14, 2025
ఎర్రగుంట్ల: రేపటి నుంచి నిరవధిక సమ్మె

ఎర్రగుంట్ల మండలంలోని ఆర్‌టీపీపీపీ మెయిన్ గేట్ వద్ద విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. 2022లో నిలిచిపోయిన బకాయిలు వెంటనే చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడలో యాజమాన్యంతో నిన్న జరిగిన చర్చలు విఫలమవడంతో రేపటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు ప్రకటించారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలన్నారు.
News October 14, 2025
E20 వాడకంతో ఆ కార్లలో మైలేజ్ డ్రాప్: సర్వే

20శాతం <<17378231>>ఇథనాల్<<>> కలిపిన పెట్రోల్‌ను వాడుతున్న కార్లలో మైలేజ్ తగ్గుతుందని ఓ సర్వేలో తేలింది. మొత్తం 36వేల మంది ఈ సర్వేలో పాల్గొనగా 2022 అంతకుముందు కొన్న కార్లలో ప్రతి 10లో ఎనిమిదింటిలో ఈ ప్రాబ్లమ్ ఉందని పేర్కొంది. ఆగస్టులో ఈ సమస్య 67శాతంగా ఉండగా ప్రస్తుతం 80శాతానికి పెరిగిందని వివరించింది. అంతేకాకుండా 52% వాహనాదారులు ఇంజిన్, ట్యాంక్ ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.
News October 14, 2025
సత్యసాయి శతజయంతి వేడుకలకు ఉపరాష్ట్రపతికి ఆహ్వానం

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు నవంబర్ 23 నుంచి ఘనంగా జరగనున్నాయి. సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ఢిల్లీలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాబా చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం సత్యసాయి సేవా కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రసంశించినట్లు రత్నాకర్ తెలిపారు.