News April 17, 2025

పాల్వంచ పెద్దమ్మకు సువర్ణ పుష్పార్చన

image

పాల్వంచ పెద్దమ్మ గుడిలో గురువారం ఆలయ ఈవో రజనీకుమారి ఆదేశాల మేరకు ఆలయ అర్చకులు పెద్దమ్మ తల్లికి సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా పుష్పార్చన పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు జరిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రత్యేక పూజలు పరిసర ప్రాంతాల భక్తులు, పెద్దమ్మ గుడి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News April 19, 2025

జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

గుంటూరులో ఒక వ్యక్తి ఇంటి కల విషాదంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. ఫారూఖ్ ప్రగతినగర్‌లో తన ప్లాట్‌లో ఇంటి నిర్మాణానికి రాము అనే వ్యక్తికి రూ. 1 లక్ష ఇచ్చాడు. పనులు నెమ్మదిగా సాగడం, అడిగినా స్పందన లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఫారూఖ్, ఈ నెల 16న పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 19, 2025

ఖమ్మం కంచుకోటలో.. ఎర్ర జెండా పార్టీలు పుంజుకునేనా?

image

దేశంలో కమ్యూనిస్టులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అడ్డాగా ఉండేది. జిల్లాను CPI, CPM, CPIML మాస్ లైన్, CPIML న్యూ డెమోక్రసీ నేతలు ఏకఛత్రాధిపత్యంతో ఏలారు. అలాంటి ప్రాంతాల్లో నేడు ఆ పార్టీల ఉనికి తగ్గుతోంది. నాడు ప్రజాసమస్యలపై కదిలిన ఎర్ర దండు.. నేడు ఆ స్థాయిలో ప్రభావం చూపడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. అలాగే కమ్యూనిస్టుల మధ్య సమన్వయం లోపించిందని అంటున్నారు. మళ్లీ ఆ పార్టీలు పుంజుకునేనా.. కామెంట్ చేయండి.?

News April 19, 2025

ఆర్ఎస్పీపై తప్పుడు ప్రచారాలు.. తెలంగాణ గళంపై ఫిర్యాదు

image

కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు “తెలంగాణ గళం” అనే సోషల్ మీడియా సంస్థపై ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్యామ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ గళం అనే సోషల్ మీడియా సంస్థ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్పీ ఫోటోలు వీడియోలను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేసిందన్నారు. బీఆర్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా చేసిన ఈ తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు.

error: Content is protected !!