News March 30, 2025
పాల్వంచ పెద్దమ్మ గుడి పాలకవర్గం.. భట్టిVSపొంగులేటి

పాల్వంచ పెద్దమ్మ గుడి పాలకవర్గం నియామకం Dy.CM భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల మధ్య రాజకీయ ఆధిపత్యానికి దారి తీసింది. Dy.CM చొరవతో ఆలయ ఛైర్మన్‌గా జమ్ముల రాజశేఖర్, సభ్యులను నియమిస్తూ మార్చి 6న ఉత్తర్వులు వెలువడ్డాయి. తనకు తెలియకుండా ఎలా నియమిస్తారని మంత్రి సురేఖను పొంగులేటి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరో లిస్టు రెడీ చేశారని.. పాలకవర్గం నియామకం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
Similar News
News April 1, 2025
రేపటి నుంచి క్రయవిక్రయాలు ప్రారంభం..!

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ బుధవారం పునః ప్రారంభం కానున్నదని మార్కెట్ శాఖ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వారాంతపు సెలవు, ఉగాది, రంజాన్ సెలవుల అనంతరం రేపటి నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు పునః ప్రారంభం అవుతాయని చెప్పారు. కావున ఈ విషయాన్ని జిల్లా రైతు సోదరులు గమనించి తమ పంటను వ్యవసాయ మార్కెట్ కు తీసుకొని అమ్మకాలు జరుపుకోవాలని పేర్కొన్నారు.
News April 1, 2025
గ్రూప్–1,2,3,4లో సత్తాచాటిన యువకుడు

కామేపల్లి యువకుడు గ్రూప్–1,2,3,4 ఫలితాల్లో సత్తాచాటాడు. గోవింద్రాల బంజరకు చెందిన గంగారపు సత్యనారయణ – జ్యోతిర్మయి దంపతుల కుమారుడు రత్నేశ్వరనాయుడు ఇటీవల విడుదలైన గ్రూప్-1లో రాష్ట్ర స్థాయిలో 277వ ర్యాంక్, జోనల్‌స్థాయిలో 120వ ర్యాంక్ సాధించారు. ఆయన ఖమ్మంలోని కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చినా జాయిన్ కాలేదు.
News April 1, 2025
భూకంప జోన్-3లో భద్రాచలం

భూకంపాలు ఏర్పడే జోన్-3 పరిధిలో భద్రాచలం ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ప్రాంతంలో తీవ్రత 0.125గ్రావిటీగా ఉంటుందని తెలిపారు. దీంతో భూకంపాలు స్వల్పంగా వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గత 56ఏళ్లలో ఈ ప్రాంతంలో 199సార్లు భూకంపాలు వచ్చాయన్నారు. 1969లో పర్ణశాలలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. 2024 DEC 4న కూడా ఇక్కడ భూమి స్వల్పంగా కంపించింది.