News February 10, 2025
పాల్వంచ: ‘ప్రజావాణి దరఖాస్తు పరిష్కారంలో జాప్యం చేయొద్దు’

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కారంలో జాప్యం చేయొద్దని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News July 5, 2025
ADB: బాలలను పనిలో పెట్టుకున్న ముగ్గురిపై కేసు నమోదు

బాలలను పనిలో పెట్టుకున్న ముగ్గురిపై శుక్రవారం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదిలాబాద్ మదీనా హోటల్‌లో బాల కార్మికుడితో పని చేయించుకుంటున్న యజమాని అబ్దుల్ హసీబ్‌పై కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. అదేవిధంగా మాంసం దుకాణ యజమాని ప్రవీణ్, మదీనా బెడ్ వర్క్ యజమాని షేక్ ఫరీద్‌పై కార్మిక శాఖ అధికారి శంకర్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు 1 టౌన్ సీఐ సునీల్ చెప్పారు.
News July 5, 2025
పాప్ సింగర్స్‌ను వెనక్కినెట్టిన అర్జీత్

బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జీత్ సింగ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ స్పాటిఫైలో 151 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో టేలర్ స్విఫ్ట్(139.6M), ఎడ్ షీరన్(121M) వంటి ఇంటర్నేషనల్ స్టార్స్‌ను వెనక్కినెట్టారు. అత్యధిక ఫాలోవర్లు కలిగిన సింగర్‌గా నిలిచారు. అర్జీత్ తర్వాత ఇండియన్స్‌లో ఏఆర్ రెహమాన్(65.6M) 14వ స్థానం, ప్రీతమ్(53.4M) 21, నేహా కక్కర్(48.5M) 25వ ప్లేస్‌లో ఉన్నారు.
News July 5, 2025
జైస్వాల్ ఖాతాలో అరుదైన రికార్డు

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ జైస్వాల్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో 28 రన్స్ చేసి ఔటైన జైస్వాల్ టెస్టుల్లో వేగంగా 2000 రన్స్ పూర్తిచేసిన భారత ప్లేయర్‌గా నిలిచారు. 40 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయి చేరుకుని లెజెండ్స్ సెహ్వాగ్, ద్రవిడ్ సరసన చేరారు. మరోవైపు దిగ్గజం సచిన్ తర్వాత 2 వేల రన్స్ పూర్తిచేసిన రెండో యంగెస్ట్ ప్లేయర్‌గా జైస్వాల్ నిలిచారు.