News June 17, 2024

పాల్వంచ: మనవరాలి మృతి తట్టుకోలేక నాయనమ్మ మృతి

image

అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవరాలు మృతి చెందడంతో మనస్తాపానికి గురై నాయనమ్మ మృతి చెందిన ఘటన పాల్వంచ మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. రేగులగూడెం గ్రామానికి చెందిన పాపక్క(50) మనవరాలు ఈనెల 13న టైఫాయిడ్‌‌‌తో చికిత్స పొందుతూ మృతి చెందింది. అప్పటినుంచి తీవ్ర మనోవేదనకు గురైన పాపక్క ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయిందని స్థానికులు తెలిపారు.

Similar News

News October 6, 2024

దేశానికి రోల్ మోడల్‌గా కొత్త చట్టం: మంత్రి

image

ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టంలో మార్పులను తీసుకువచ్చి దేశానికే రోల్ మోడల్‌గా ఉండేలా నూతన రెవెన్యూ (ఆర్ఓఆర్) చట్టాన్ని తీసుకురానున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా సాగర్ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గతంలో తెచ్చిన 2020 రెవెన్యూ చట్టం, ధరణి వల్ల రాష్ట్రంలోని రైతులు, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, అలా తాము చేయబోమన్నారు.

News October 6, 2024

దేశానికి రోల్ మోడల్ గా ఉండేలా నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తాం: మంత్రి

image

ప్రస్తుతం ఉన్న రెవిన్యూ చట్టంలో మార్పులను తీసుకువచ్చి దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా నూతన రెవెన్యూ (ఆర్ఓఆర్) చట్టాన్ని తీసుకురానున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గతంలో తెచ్చిన 2020 రెవెన్యూ చట్టం, ధరణి వల్ల రాష్ట్రంలోని రైతులు, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, అటువంటివి తాము చేయమన్నారు.

News October 5, 2024

రైతుబంధులో అవకతవకలు జరిగాయి: మంత్రి పొంగులేటి

image

రైతుబంధులో అవకతవకలు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మం. నెల్లికల్‌లో భూసమస్యల పరిష్కారం కోసం రైతులతో ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్టిఫికెట్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాబోయే గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని ఓటర్లకు సూచించారు.