News November 11, 2024
పాల్వంచ: సర్వేను పగడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఎన్యూమరేటర్లను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని బొల్లోరిగూడెం 11వ వార్డులో పర్యటించారు. సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను పర్యవేక్షించి వివరాల సేకరణలో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని ఎన్యూమరేటర్లను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు ఉంటే సూపర్‌వైజర్లకు తెలపాలని అన్నారు.
Similar News
News November 13, 2024
ఖమ్మం: వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15న గురునాయక జయంతి, 16, 17న వారాంతపు సెలవు కారణంగా మూడు రోజులపాటు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి ఈ నెల 18 సోమవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయన్నారు. ఈ విషయాన్ని రైతులు, వ్యాపారస్థులు గమనించాలని కోరారు.
News November 13, 2024
KCR పాలనలో అవినీతిపై భద్రాచలం నుంచి పాదయాత్ర: TRS
మాజీ సీఎం KCR పాలనలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం CBIతో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సమితి(TRS) చీఫ్ నరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. HYD బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్, కరెంట్ అగ్రిమెంట్, ల్యాండ్ ట్రాన్సఫర్మేషన్‌లో KCR రూ.వేల కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు. KCR అవినీతి తెలియజేసేందుకు DEC 6 నుంచి భద్రాచలం-చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు పాదయాత్ర చేస్తామన్నారు.
News November 13, 2024
బోనకల్: కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని ఆళ్లపాడు గ్రామంలో మంగళవారం రాత్రి బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క సమక్షంలో వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ప్రజా పాలనతో మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వంట గ్యాస్ రూ.500కి అందించడమే కాక, అభివృద్ధి పథంలో మధిర నియోజకవర్గం నిలుస్తోందని నందిని విక్రమార్క తెలిపారు.