News July 7, 2025

పాశ మైలారం: ఆచూకీ తెలియని 8 మంది వివరాలు

image

పాశ మైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇంకా 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. వెంకటేశ్, రవి, రాహుల్, విజయ్, ఇర్ఫాన్, అఖిలేశ్, జస్టిన్, శివాజీ ఆచూకీ లభించలేదని అధికార వర్గాలు తెలిపాయి. వీరి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు పటాన్‌చెరులోనే పడిగాపులు కాస్తున్నారు.

Similar News

News July 7, 2025

కర్నూలు: నీటి పారుదల సలహా మండలితో కలెక్టర్ సమావేశం

image

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఖరీఫ్ (2025-26) పంటలకు నీటి విడుదలకు సంబంధించి జిల్లా నీటి పారుదల సలహా మండలితో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు నీటి కొరత ఉండకుండా చేయాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యేలు పార్థసారథి, బొగ్గుల దస్తగిరి, గౌరు చరిత, జేసీ,సబ్ కలెక్టర్ ఉన్నారు.

News July 7, 2025

బోనాల ఏర్పాట్లను పరిశీలించిన DCP రష్మీ పెరుమాళ్

image

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాట్లను ఈవో గుత్తా మనోహర్‌రెడ్డితో కలిసి DCP రష్మీ పెరుమాళ్ పరిశీలించారు. ఆలయం లోపల క్యూ లైన్‌లను బోనాలతో వచ్చే మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. DCPతో పాటు ఏసీపీ సుబ్బయ్య, రామేశ్వర్, కృష్ణ, ప్రకాశ్ తదితరులు ఉన్నారు.

News July 7, 2025

రేపు సీఎం శ్రీశైలం పర్యటన షెడ్యూల్

image

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శ్రీశైలం రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ఉదయం 10.50 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్ గ్రౌండ్‌కు చేరుకొని అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. 12 గంటల సమయంలో డ్యామ్ వద్దకు చేరుకొని కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.