News October 15, 2025
పింఛన్ల పునఃపరిశీలన మూడు రోజులు పాటు బంద్

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న పింఛన్ల పునఃపరిశీలన కార్యక్రమాన్ని మూడు రోజులు పాటు నిలిపివేసినట్లు డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజులు పాటు పర్యటించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సచివాలయ సంబంధ శాఖ అధికారులు దివ్యాంగులకు తెలియజేయాలని సూచించారు.
Similar News
News October 15, 2025
జిల్లా నుంచి PM కర్నూలు సభకు 250 బస్సులు కేటాయింపు

ఈనెల 16న కర్నూలు జిల్లాలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు జిల్లా నుంచి 250 బస్సులను అధికారులు కేటాయించారు. కర్నూలు(D) ఓర్వకల్లు మండలంలోని నన్నూరు వద్ద నిర్వహించే ఈ సభకు నెల్లూరు డిపో 1నుంచి 40, నెల్లూరు డిపో 2 నుంచి 50, ఆత్మకూరు డిపో నుంచి 31, కందుకూరు డిపో నుంచి 35, కావలి డిపో నుంచి 40, ఉదయగిరి డిపో నుంచి 29, రాపూరు డిపో నుంచి 25 వరకు బస్సులు కేటాయించారు.
News October 15, 2025
కౌశల్-2025 క్విజ్ పోటీల పోస్టర్ ఆవిష్కరణ

కౌశల్-2025 క్విజ్ పోటీల పోస్టర్‌ను డీఈవో బాలాజీ రావు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో చదువుతున్న 8, 9, 10 తరగతుల నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థులకు నవంబర్ 1 నుంచి పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘గణితం, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రంలో భారతీయుల కృషి’ అనే అంశాలపై క్విజ్ నిర్వహిస్తామన్నారు.
News October 15, 2025
ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

మనుబోలు(M) కాగితాలపూరు క్రాస్ రోడ్‌లోని పంజాబీ డాబా పక్కనే ఉన్న పొదలలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగు చూసింది. జట్లకొండూరుకు చెందిన కసుమూరు రమేశ్(18) వేప చెట్టుకు ఉరి వేసుకుని ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. SI శివ రాకేశ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూడూరుకు తరలించారు.