News January 11, 2026

పిండి వంటల్లో బెల్లం వాడుతున్నారా?

image

సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ చూసినా పిండి వంటల ఘుమఘుమలే. అయితే తీపి వంటకాల్లో పంచదారకు బదులు బెల్లం వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం, జింక్, సెలీనియం, విటమిన్లు ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు, దంతాలు పటిష్టంగా ఉంటాయి. శరీరంలో చేరిన మలినాలను బయటకు పంపేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.

Similar News

News January 23, 2026

V2V కోసం 30 GHz కేటాయించిన కేంద్రం

image

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఇటీవల ప్రకటించిన <<18808386>>V2V టెక్నాలజీ<<>> కోసం 30 GHz రేడియో ఫ్రీక్వెన్సీని కేటాయించినట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. దీని ద్వారా వాహనాలు ఇంటర్నెట్‌ అవసరం లేకుండా నేరుగా భద్రతా సమాచారాన్ని పంచుకుంటాయి. అన్ని వైపుల నుంచి వచ్చే ప్రమాదాలను ముందే గుర్తించి హెచ్చరిస్తుంది. ఈ టెక్నాలజీ కోసం ఒక్కో వాహనానికి రూ.5,000-7,000 ఖర్చు అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.

News January 23, 2026

ఇషాన్ కిషన్ ఊచకోత.. రికార్డ్ బ్రేక్

image

రెండో టీ20లో భారత యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ న్యూజిలాండ్‌ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఫోర్లు, సిక్సర్లతో ఊచకోత కోస్తున్నారు. ఈక్రమంలోనే 21 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదారు. దీంతో NZపై అతితక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచారు. తొలి టీ20లో అభిషేక్ 22 బాల్స్‌లో ఈ ఫీట్ సాధించగా ఇషాన్ దాన్ని బద్దలుకొట్టారు. గతంలో రోహిత్, రాహుల్ 23బంతుల్లో ఫిఫ్టీ చేశారు.

News January 23, 2026

ఒక్క బంతికే 11 రన్స్

image

NZతో రెండో టీ20లో భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ బౌండరీలతో చెలరేగారు. ఫౌల్క్స్ వేసిన మూడో ఓవర్లో 22 రన్స్ బాదారు. ఎక్స్‌ట్రాలతో కలిపి ఆ ఓవర్లో మొత్తం 24 రన్స్ వచ్చాయి. రెండో ఓవర్ తొలి బంతి ఫోర్ వెళ్లగా అంపైర్ నో బాల్‌గా ప్రకటించారు. తర్వాత బౌలర్ 2 వైడ్లు వేశారు. ఆ తర్వాత బాల్ ఫోర్ వెళ్లింది. దీంతో ఒక్క బంతికే 11 రన్స్ (4+nb+wd+wd+4) వచ్చినట్లయింది.