News March 21, 2025
పిఎంశ్రీకి జిల్లాలో 40 పాఠశాలలు ఎంపిక: DEO

పీఎంశ్రీ పథకంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 40 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక అయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఏడు విడతల్లో మొత్తం 40 స్కూళ్లు ఎంపికైనట్లు చెప్పారు. ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈనెల 25లోగా https://pmshrischools.education.gov.in వెబ్ సైట్లో నమోదు చేయాలని సూచించారు.
Similar News
News February 14, 2026
ఘనంగా భాష్యం బ్లూమ్స్ వార్షికోత్సవ వేడుకలు

గోరంట్ల భాష్యం ఇంటర్నేషనల్ స్కూల్లో ‘బ్లూమ్స్ బ్లూమ్రాంగ్’ వార్షికోత్సవం జరిగింది. మార్కులు మాత్రమే కాదు, నైపుణ్యాల ఆధారిత విద్య అవసరమని ముఖ్యఅతిథి డా.లలిత్ అన్నారు. విద్యార్థులు విలువలతో ఎదగాలని జిల్లా జడ్జి ఎం.ఇందిర ప్రియదర్శిని.., భాష్యం అందించిన విలువలే తన విజయానికి కారణమని పూర్వవిద్యార్థి డా.ఘంటా చైతన్య అన్నారు. ఛైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ ఛైర్మన్ హనుమంతరావు, ఎండీ సాకేత్ రామ్ పాల్గొన్నారు.
News February 14, 2026
అనకాపల్లి జేసీగా సౌర్య మాన్ పటేల్ బాధ్యతలు

అనకాపల్లి జిల్లా సంయుక్త కలెక్టర్‌గా శౌర్యమాన్ పటేల్ శనివారం రాత్రి విధుల్లో చేరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించి, తొలి సంతకం చేశారు. ఆయన ఇంతవరకు అమరావతి కేంద్రంగా ఉన్న ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశారు. బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు.
News February 14, 2026
మెదక్: రేపు 11లోపు Form-A సమర్పించాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ అధికార ప్రతినిధిత్వానికి సంబంధించి Form-Aని రేపు ఉ.11 గంటలలోగా సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. అలాగే Form-Bని ఎన్నిక రోజు ఉ.10 గంటల వరకు అందజేయాలని సూచించారు. గడువులోపు మార్పులకు అవకాశం ఉంటుందని, ఎన్నికల సమావేశం చెల్లుబాటు కావాలంటే కనీసం 50 శాతం సభ్యుల హాజరు తప్పనిసరని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన కోరారు.


