News April 10, 2025
పిటిషన్లపై సత్వర చర్యలకు కృషి: KMR SP

సమస్యలపై పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు ఇస్తున్న సందర్భంలో పూర్తి చిరునామా, మొబైల్ నంబర్‌ను స్పష్టంగా పేర్కొనాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారుల పట్ల పారదర్శకత, వేగవంతమైన స్పందన, ప్రజలతో సమర్థమైన సమాచార పంపిణీ కోసం ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ప్రజల సహకారంతో పోలీసు శాఖ మరింత సమర్థంగా సేవలందించగలదని వెల్లడించారు.
Similar News
News November 9, 2025
జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్‌లో 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇవాటే ప్రావిన్సు తీరంలో 10కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అటు అండమాన్, నికోబార్ దీవుల్లోనూ ఈ మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది. ప్రాణ, ఆస్తి నష్టం గురించి వివరాలు వెల్లడి కాలేదు.
News November 9, 2025
ష్.. ఊపిరి పీల్చుకో..!

జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచార పర్వం ముగిసింది. 2 వారాలుగా మోగిన మైకులు, ఉపన్యాసాలిచ్చిన నేతల గొంతులు సైలెంట్ అయ్యాయి. ఎన్నికల 48గం. ముందు సైలెన్స్ పీరియడ్ రూల్‌తో జూబ్లీహిల్స్ ప్రస్తుతం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటోంది. విమర్శలు, సవాళ్లు, సెంటిమెంట్లు, డెవలప్మెంట్లు సహా ఎన్నో విన్న ప్రజాస్వామ్య దేవుళ్లు ఈ నెల 11న తమ తలరాత రాసుకోనున్నారు. అటు బిహార్‌లోనూ రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది.
News November 9, 2025
డెడ్ బాడీలో రక్త ప్రసరణ.. డాక్టర్ల అరుదైన ఘనత

ఢిల్లీలోని మణిపాల్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ప్రక్రియలో విజయం సాధించారు. పక్షవాతంతో చనిపోయిన గీతా చావ్లా(55) అనే మహిళ శరీరంలో రక్తప్రసరణను తిరిగి ప్రారంభించి చరిత్ర సృష్టించారు. ఇందుకోసం ఎక్స్‌ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేటర్(ECMO)ను ఉపయోగించారు. తర్వాత ఆమె కాలేయం, మూత్రపిండాలను సేకరించి ఇతరులకు విజయవంతంగా అమర్చారు. ఇలా చేయడం ఆసియాలోనే తొలిసారి అని ఆస్పత్రి ఛైర్మన్ శ్రీనివాసన్ తెలిపారు.


