News April 10, 2025

పిటిషన్లపై సత్వర చర్యలకు కృషి: KMR SP

image

ప్రజలు పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు ఇస్తున్న సందర్భంలో పూర్తి చిరునామా, మొబైల్ నంబర్‌ను స్పష్టంగా పేర్కొనాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారుల పట్ల పారదర్శకత, వేగవంతమైన స్పందన, ప్రజలతో సమర్థమైన సమాచార పంపిణీ కోసం ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ప్రజల సహకారంతో పోలీసు శాఖ మరింత సమర్థంగా సేవలందించగలదని వెల్లడించారు.

Similar News

News December 28, 2025

అధికారులు చూసుకుంటారు.. నాకేం సంబంధం?: భూమన

image

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డిని సిట్ 2 గంటలకు పైగా విచారించింది. అధికారుల ప్రశ్నలకు తనకేమీ తెలియదని ఆయన చెప్పినట్లు తెలిసింది. నెయ్యి సరఫరా గురించి అధికారులు చూసుకుంటారని, తామెందుకు పట్టించుకుంటామని అన్నట్లు సమాచారం. నాణ్యత లేదని నెయ్యిని తిరస్కరించడం ఎప్పటి నుంచో జరుగుతోందని చెప్పారని, NTR హయాం నుంచే ట్యాంకర్లను తిప్పి పంపుతున్నారని చెప్పినట్లు తెలుస్తోంది.

News December 28, 2025

వెన్నును బలిష్ఠంగా చేసే మేరుదండ ముద్ర

image

మేరుదండ ముద్రను రోజూ సాధన చెయ్యడం వల్ల వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగుపడటంతో పాటు వెన్నునొప్పిని తగ్గించడానికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ముందుగా వజ్రాసనం/ సుఖాసనంలో కూర్చోని చేతులను తొడలపై ఉంచాలి. బొటన వేలును నిటారుగా పెట్టి మిగతా నాలుగువేళ్లను మడిచి ఉంచాలి. దీన్ని రోజూ సాధన చెయ్యడం వల్ల వెన్ను నొప్పి కూడా తగ్గుతుందంటున్నారు.

News December 28, 2025

వైకుంఠ ద్వార దర్శనంతో ఆరోగ్యం!

image

ఉత్తర ద్వార దర్శనం జ్ఞాన వికాసానికి సూచిక. మన శరీరంలో ఉత్తర భాగంలో ఉండే ‘సహస్రార చక్రం’ ఆధ్యాత్మిక ఉన్నతిని సూచిస్తుంది. ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించడం అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి, దైవిక జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకోవడమే. ఆలయానికి వెళ్లలేని వారు ఏకాగ్రతతో మనసులోనే ఆ శ్రీహరిని స్మరించుకున్నా సంపూర్ణ ఫలితం దక్కుతుంది. భక్తితో చేసే ఈ దర్శనం మనకు శాశ్వత శాంతిని, మోక్షాన్ని చేకూరుస్తుంది.