News January 19, 2025
పిట్టలవానిపాలెంలో రోడ్డు ప్రమాదం
పిట్టలవానిపాలెం మండలం భావనారాయణపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించి పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 19, 2025
గుంటూరులో CA విద్యార్థి ఆత్మహత్య
బ్రాడీపేటలో ఆత్మహత్యకు పాల్పడింది CA చివరి సంవత్సరం చదువుతున్న కె.నాగప్రసాద్ (27) గా అరండల్ పేట పోలీసులు నిర్ధారించారు. గూడూరు పట్టణానికి చెందిన నాగప్రసాద్ ఆదివారం హాస్టల్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. ఈ ఘటనతో విజ్ఞాన కేంద్రానికి చిరునామాగా ఉన్న బ్రాడీపేటలో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నాగప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News January 19, 2025
డిప్యూటీ సీఎం కార్యాలయం వద్ద పోలీసుల విచారణ
మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం అలాగే జాతీయ పార్టీ కార్యాలయం వద్ద శనివారం డ్రోన్ కలకలం రేపిన సంగతి విధితమే. ఈ మేరకు జిల్లా పోలీస్ అధికారులు క్యాంపు కార్యాలయం వద్ద విచారణ చేపట్టారు. డ్రోన్ ఎవరు ఎగరవేశారు, ఎటువైపు నుంచి డ్రోన్ వచ్చింది అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. పవన్ కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.
News January 19, 2025
గుంటూరు: దేహదారుడ్య పరీక్షల్లో 312 మంది ఉత్తీర్ణత
కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షల్లో 312 మంది ఉత్తీర్ణత సాధించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న పరీక్షల్లో శనివారం 529 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పలు దశల్లో కొందరు అనర్హులుగా మిగిలారు. దీంతో మొత్తం 434 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో చివరికి 312 మంది అర్హత పొందారు. అదనపు ఎస్పీలు జీవీ రమణ మూర్తి, ఎ. హనుమంతు పరీక్షలను పరిశీలించారు.