News December 12, 2025

పిట్టవానిపాలెం: బైకులు ఎదురెదురుగా ఢీ.. ఇద్దరు మృతి

image

పిట్టలవానిపాలెం మండలంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. కుంచాలవారిపాలెం వంతెన వద్ద నుంచి పిట్టలవానిపాలెం వెళ్లే రహదారిలో పెద్దపల్లికి చెందిన ఆటల భాను(20), చినమట్టపూడికి చెందిన షేక్ జాన్ సైదా(30) బైకులు ఎదురెదురుగా ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఇరువురూ అక్కడికక్కడే మృతి చెందగా, జాన్ సైదా భార్యకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 12, 2025

నెల్లూరు: కూతురుపై కాటు వేసిన కామాంధు తండ్రికి యావజ్జీవ కారాగార శిక్ష

image

కన్న కూతురుపై కన్నేసిన ఓ తండ్రి కామంతో కాటు వేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం నిందితుడు చల్లా దశరథకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.25 వేలు జరిమానా విధించినట్లు వింజమూరు ఎస్సై కే వీరప్రతాప్ తెలిపారు. 2020 లో వింజమూరు బీసీ కాలనీకి చెందిన దశరథ తన కూతురు‌ను బైక్‌పై ఎక్కించుకొని నేరేడుపల్లి గ్రావెల్ రోడ్డు సమీపంలో ఉన్న నిమ్మ తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

News December 12, 2025

అన్ని మతాలకు వాస్తు వర్తిస్తుందా?

image

వాస్తు ఓ మతానికే పరిమితం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘వాస్తు పంచభూతాల కలయికపై ఆధారపడిన శాస్త్రం. మతాలు, కులాలు మనుషులు ఏర్పరచుకున్నవే. పంచభూతాలు మతాలకు అతీతమైనవి కాబట్టి వాస్తు కూడా అతీతమే అవుతుంది. మనం నివసించే ఇంట్లో ఇవి సక్రమంగా, సమతుల్యంగా ఉన్నప్పుడే జీవితం సవ్యంగా, ఆరోగ్యంగా సాగుతుంది. లేకపోతే ఆ దుష్ఫలితాలు అందరికీ ఒకేలా ఉంటాయి. వాస్తు అందరికీ అవసరం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 12, 2025

జనగామ జిల్లాలో 71 మందికి షోకాజ్ నోటీసులు

image

జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 71 మందికి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా, ముందస్తు సమాచారం అందించకుండా విధులకు గైర్హాజరు వారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్స్ అతిక్రమించిన వీరిపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో ఎంపీడీవోల ద్వారా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.