News April 25, 2024
పిట్లంలో బైక్‌ను ఢీకొన్న డీసీఎం.. వ్యక్తి మృతి
పిట్లం మండలం గద్ద గుండు తండా సమీపంలో జాతీయ రహదారి (161)పై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై రాంగ్ రూట్‌లో వెళ్తున్న వ్యక్తిని డీసీఎం ఢీకొంది. దీంతో బైక్ మీద ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 9, 2025
NZB: రైల్వే స్టేషన్ ప్రాంతంలో వృద్ధుడు మృతి
నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు SHO రఘుపతి బుధవారం తెలిపారు. రైల్వే స్టేషన్ ఎదురుగా దర్గా వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉండటంతో స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.
News January 9, 2025
నిజామాబాద్: అరకిలో గంజాయి పట్టివేత
నిజామాబాద్ వినాయక నగర్ అమరవీరుల స్థూపం సమీపంలో బుధవారం గంజాయి ప్యాకెట్లను 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది దాడులు నిర్వహించి అరకిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనంతరం నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
News January 9, 2025
NZB: మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌లో కురగాయల వ్యాపారుల ఆందోళన
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ ఎదుట కూరగాయల వ్యాపారాలు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు. స్థానిక అంగడి బజార్‌లో తమను రోడ్ల మీద నుంచి తొలగించి డీఎస్ కాంప్లెక్స్‌లోకి తరలించడం కూరగాయల వ్యాపారులు గత కొద్దీ రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రోజువారీ వ్యాపారాలు దెబ్బతింటాయని MIM నేతలు జిల్లా కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.