News October 9, 2025
పిట్లం: అదృష్టం బాగుంది… ప్రాణాలు సేఫ్!

పిట్లం వద్ద హైవే పై అండర్ పాస్ బ్రిడ్జిపై గురువారం ప్రమాదం జరిగింది. HYD నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న లారీని, అదే రూట్‌లో వెనుక వస్తున్న కారు ఢీకొని ఇరుక్కుపోయింది. లారీ ఆ కారును సుమారు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. మహారాష్ట్రలోని పర్భణికి చెందిన ఇద్దరు కారులో ప్రయాణిస్తున్నారు. కారులోని ఎయిర్‌బెలూన్స్ తెరచుకోవడం వల్ల వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Similar News
News October 10, 2025
పాలమూరు: కోర్టు స్టే.. కాంగ్రెస్ MLA కీలక వ్యాఖ్యలు

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక స్టేను చూసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఆశావహులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇందుకు సంబంధించి పార్టీపరమైన స్పష్టత రెండు రోజుల్లో రాబోతోందని కాంగ్రెస్ నేత, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
News October 10, 2025
దేశంలో బురఖా బ్యాన్‌కు ప్లాన్ చేస్తున్న మెలోని!

ఇటలీలో ఇస్లామిక్ తీవ్రవాదం, వేర్పాటువాదం కట్టడికి ఆ దేశ PM మెలోని సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో బురఖా, హిజాబ్, నిఖాబ్ ధరించడం, మసీదులకు ఫండింగ్‌ను బ్యాన్ చేయనున్నట్లు సమాచారం. రిలీజియస్ ఫ్రీడమ్ ఉండాలి కానీ, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాలస్తీనాకు మద్దతుగా అక్కడ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడం తెలిసిందే.
News October 10, 2025
న్యూస్ అప్‌డేట్స్ @12am

*తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ. కీలకమైన సాక్ష్యాలు లభించాయన్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. విచారణ అక్టోబర్ 14కు వాయిదా.
*సుప్రీంకోర్టులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 3కు వాయిదా