News October 27, 2025
పిట్లం: తండ్రికి కల్లులో విషం.. కొడుకు ఘాతుకం..!

వృద్ధుడైన తండ్రికి సేవ చేయడం భారంగా భావించిన ఆ కొడుకు.. తండ్రి తాగే కల్లులో విషం కలిపి హత్య చేశాడు. ఈ ఘటన పిట్లం(M) గౌరారం తండాలో శుక్రవారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SI వెంకట్రావ్ ప్రకారం.. తండావాసి దశరథ్ కొడుకు వామన్ వద్దుంటున్నాడు. తండ్రికి వృద్ధాప్య సేవలు చేయలేక వామన్ కల్లులో విషం కలిపి ఇచ్చి హతమార్చాడు. కేసు నమోదు చేసి, నిందితుడైన వామన్‌ను ఆదివారం రిమాండ్‌కు తరలించారు
Similar News
News October 27, 2025
కరూర్ తొక్కిసలాట బాధితులతో విజయ్ భేటీ

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల తర్వాత బాధిత కుటుంబాలను నటుడు, TVK చీఫ్ విజయ్ కలిశారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో 50 రూమ్స్ బుక్ చేసి పార్టీ నేతలు బస్సుల్లో వారిని అక్కడికి తీసుకెళ్లారు. బాధితులతో విజయ్ మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. అంతకుముందు మృతుల కుటుంబాలకు విజయ్ రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించడం తెలిసిందే.
News October 27, 2025
శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే?

శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే ఉండనున్నట్లు సమాచారం. దీనిపై జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల, గ్రామ సరిహద్దులు, పేర్ల మార్పునకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రేపు సీఎంకు నివేదిక పంపనుంది. అయితే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. మార్కాపురం-శ్రీశైలం 81KM, నంద్యాల-శ్రీశైలం 160KM. మార్కాపురానికి దగ్గరగా ఉందన్న కారణంతోనే కొందరు శ్రీశైలాన్ని ఆ జిల్లాలో కలపాలనే వినతులు సమర్పించారట.
News October 27, 2025
వికారాబాద్: లక్ ఎవరిదో కాసేపట్లో తేలనుంది

వికారాబాద్ జిల్లాలోని 59 మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించిన డ్రా తీసేందుకు ఎక్సైజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వికారాబాద్ అంబేడ్కర్ భవన్‌లో ఉదయం 11 గంటలకు కలెక్టర్ సమక్షంలో లాటరీ నిర్వహించనున్నారు. డ్రా కేంద్రంలోకి సెల్‌ఫోన్లను అనుమతించబోమని, ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.


