News September 14, 2025
పిట్లం: నవ మాసాలు మోసినందుకు దక్కిన బహుమతి ఇదేనా?

పిట్లం మండలం బొల్లక్ పల్లి మంజీరా బ్రిడ్జి వద్ద ఈ నెల 11న మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. బాన్సువాడ DSP విఠల్ రెడ్డి వివరాలు.. బోర్లం గ్రామానికి చెందిన సాయవ్వ(77) ఆరోగ్యం బాగ లేక మంచాన పడటంతో ఆమె కుమారుడు బాలయ్య స్నేహితుడితో కలిసి ఈ నెల 8న రాత్రి మంజీరాలోకి తోసి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. నిందితులిద్దరిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు DSP వెల్లడించారు.
Similar News
News September 14, 2025
జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక హైకమాండ్‌దే: రేవంత్

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయం హైకమాండ్ చూసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్, మంత్రులతో సమావేశమైన రేవంత్.. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆదేశించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. బూత్‌ల వారీగా ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
News September 14, 2025
రుషికొండ బీచ్‌లో ఇద్దరు బాలురు గల్లంతు

రుషికొండ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. పీఎం పాలెం, ఆర్‌హెచ్ కాలనీ ప్రాంతాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు సంజయ్, సాయితో పాటు మరో ఇద్దరు రుషికొండ బీచ్‌కు వెళ్లారు. అక్కడ స్నానానికి దిగగా అలల ఉద్ధృతికి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరిని మెరైన్ పోలీసులు, లైఫ్ గాడ్స్ కాపాడారు. సంజయ్, సాయి అచూకీ ఇంకా లభ్యం కాలేదని పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపారు.
News September 14, 2025
రెండో కాన్పు తర్వాత చాలా ఇబ్బంది పడ్డా: ఇలియానా

రెండో ప్రసవం తర్వాత తాను ఎదుర్కొన్న ఇబ్బందులను హీరోయిన్ ఇలియానా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘రెండో బిడ్డ పుట్టినప్పుడు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలి. ఆ సమయంలో పూర్తిగా గందరగోళంగా ఉంటుంది. నేను అది చాలా కష్టంగా ఫీలయ్యాను. మెంటల్ స్పేస్ పూర్తిగా లేకుండా పోయింది. ఆ సమయంలో నేను ముంబైలో లేను. అక్కడే ఉండుంటే నాకు సాయం చేసేందుకు ఫ్రెండ్స్ ఉండేవారు’ అని ఆమె చెప్పుకొచ్చారు.