News October 28, 2024

పిట్లం: వరల్డ్ చెస్ బాక్సింగ్ పోటీల్లో ప్రతిభకు కాంస్యం

image

అంతర్జాతీయ చెస్ బాక్సింగ్‌లో కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన తక్కడ్ పల్లి ప్రతిభ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ నెల 23 నుంచి 28 వరకు ఆర్మేనియా దేశం, ఎరెవాన్లో 6వ ప్రపంచ స్థాయి చెస్ బాక్సింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతిభ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 19, 2025

NZB: టీచర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: TPCC చీఫ్

image

టీచర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ట్రస్మా ఆధ్వర్యంలో శుక్రవారం NZBలో నిర్వహించిన టీచర్స్‌ డే సెలబ్రేషన్స్‌ బెస్ట్‌ టీచర్ అవార్డ్స్-2025 పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లడారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌, హెల్త్‌ కార్డు అమలు, స్కిల్‌ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ కళాశాలలు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.

News September 19, 2025

NZB: SC, ST కోర్టు PPగా దయాకర్ గౌడ్

image

నిజామాబాద్ జిల్లా SC, ST కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా R.దయాకర్ గౌడ్ నియమితులయ్యారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన జర్నలిస్ట్‌గా ప్రస్థానం మొదలు పెట్టారు. 2004 నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. TPCC లీగల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్‌గా ఉన్న ఆయన పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తూన్నారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ అగ్రనేతల సమన్వయంతో PPగా నియమితులయ్యారు.

News September 19, 2025

NZB: 250కిపైగా పిల్లలున్నా.. లేని ప్రభుత్వ టీచర్..!

image

రుద్రూర్ మండలం సులేమాన్ నగర్లోని MPPS ఉర్దూ మీడియం HM అఫ్సర్ మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన సందర్భంగా ఆయన్ను గురువారం మాజీ MPTC గౌస్, స్కూల్ సిబ్బంది, గ్రామస్థులు సన్మానించారు. అయితే ఈ స్కూల్‌లో 250కిపైగా విద్యార్థులున్నా వీరికి గణితం, తెలుగు బోధించేందుకు టీచరే లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో పిలలకు నష్టం జరగకుండా గౌస్ 2024 నుంచి నెలకు రూ.3,000 జీతం ఇస్తూ ఓ మహిళా టీచర్‌తో చదువు చెప్పిస్తున్నారు.