News December 13, 2025
పిఠాపురంలో ఘర్షణ.. కత్తితో దాడి

పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వద్ద వాహనం పార్కింగ్ వివాదం కత్తిపోట్లకు దారితీసింది. స్థానికుల వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి పెద్దాపురం నుంచి వచ్చిన ముగ్గురు భక్తులు కారు పార్క్ చేసే క్రమంలో మరో డ్రైవర్‌తో వాగ్వాదం జరిగింది. ఘర్షణ తీవ్రం కావడంతో అవతలి వ్యక్తి కత్తి, స్క్రూ డ్రైవర్‌తో భక్తులపై దాడికి తెగబడ్డాడని తెలిపారు. దీంతో తోటి భక్తులు భయాందోళనకు గురయ్యారు.
Similar News
News December 15, 2025
బిజినేపల్లి: వార్డు మెంబర్‌గా గెలిచి హఠాన్మరణం

బిజినేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా జుర్రు మహేశ్ యాదవ్(34) పోటీ చేసే విజయం సాధించారు. అర్ధరాత్రి హఠాత్తుగా మృత్యువాత పడటం గ్రామంలో విషాదం నింపింది. ఆయన మరణంపై కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
News December 15, 2025
భద్రకాళి సన్నిధిలో మోగ్లీ చిత్ర యూనిట్

వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి అమ్మవారిని ఇటీవల విడుదలయిన మోగ్లీ చిత్ర యూనిట్ దర్శించుకుంది. చిత్రం హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మడోల్కర్, చిత్ర యూనిట్ సభ్యులు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజానంతరం ఆలయ స్నపన మండపంలో మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు.
News December 15, 2025
లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

⋆ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న ‘ఫంకీ’ సినిమా 2026, ఫిబ్రవరి 13న విడుదల
⋆ అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమా టీజర్‌ను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మూవీ టీమ్
⋆ విఘ్నేశ్ శివన్ డైరెక్షన్‌లో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ విడుదల వాయిదా.. ఈ నెల 18న రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్‌పోన్ చేసిన టీమ్


