News April 25, 2024

పిఠాపురంలో పవన్‌‌పై పోటీకి 10 మంది నామినేషన్

image

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి సంబంధించి ఇప్పటివరకూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు మొత్తం 11 మంది అభ్యర్థులు, 19 నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. గురువారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తుందని తెలిపారు.

Similar News

News October 13, 2025

తూ.గో టీడీపీ అధ్యక్ష పదవికి బొడ్డు,యర్రా పేర్లు పరిశీలన..?

image

రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరిని జిల్లా టీడీపీ అధ్యక్షునిగా నియమిస్తారనే గుసగుస వినిపిస్తోంది. జిల్లాలో కాపు సామాజిక వర్గ ప్రాబల్యం అధికంగా ఉండడంతో ఆ వర్గానికి ఇస్తే బాగుంటుందని ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. మరో వైపు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సోదరుడి బావమరిది యర్రా వేణు గోపాల్ రాయుడు పేరు తెరపైకి వచ్చింది. ఇద్దరిలో పదవి ఎవరిని వరిస్తుందనేది వేచి చూడాలి.

News October 13, 2025

తూ.గో టీడీపీ అధ్యక్ష పదవి ఏ సామాజిక వర్గానికి దక్కేనో..?

image

తూ.గో టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కేఎస్ జవహర్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో ఆ పదవి ఖాళీ అయింది. ఎస్సీ వర్గానికి చెందిన జవహర్ ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. వైసీపీ, బీజేపీ బీసీలకు, జనసేన కాపు వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్న ఇస్తున్నాయని ప్రచారం సాగుతోంది. ఖాళీ అయిన టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఏ సామాజిక వర్గానికి దక్కుతుందనేది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది.

News October 12, 2025

కొవ్వూరు జనసేన సారథి ఎవరు..?

image

కొవ్వూరు జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవి గత మూడు నెలలుగా ఖాళీగా ఉంది. సొసైటీ పదవుల నియామకంలో అన్యాయం జరిగిందని ఆందోళనకు దిగిన నాటి ఇన్‌ఛార్జ్ టీవీ రామారావును జులై 10న అధిష్ఠానం బాధ్యతల నుంచి తప్పించింది. అప్పటినుండి ఈ పోస్టు భర్తీ కాలేదు. దీంతో నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు మందగించాయని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. తక్షణమే ఇన్‌ఛార్జ్‌ను నియమించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.