News March 13, 2025

పిఠాపురంలో పవన్ ఫొటో వైరల్

image

పిఠాపురం(చిత్రాడ)లో రేపi జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభకు జయకేతనం అని పేరు పెట్టారు. పిఠాపురం, కాకినాడ, జిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా జనసేన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. పవన్‌ను ఆకట్టుకోవడానికి కొందరు వినూత్నంగా పోస్టర్లును ఏర్పాటు చేశారు. ‘రాయల వారి రాజ్యం.. పవన్ అన్నకే సాధ్యం’ అంటూ పవన్ ఫొటోను ఓ వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు రూపంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Similar News

News December 19, 2025

నల్గొండ: ఈనెల 22న మాక్ డ్రిల్: సీఎస్

image

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందస్తు అప్రమత్తతతోనే ప్రాణనష్టాన్ని నివారించగలమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘మాక్ ఎక్సర్‌సైజ్’ను విజయవంతం చేయాలని కోరారు.

News December 19, 2025

విపత్తుల నిర్వహణ సన్నద్ధతపై ఈనెల 22న మాక్‌డ్రిల్

image

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్ధవంతంగాఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఈనెల 22వ తేదీన చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతంలో ప్రయోగాత్మకంగా చేపట్టే మాక్ ఎక్సర్ సైజ్ ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డా.సత్యశారద అధికారులను ఆదేశించారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం నివారణకు తక్షణ చర్యలపై సన్నద్ధత కోసం ఈమాక్ ఎక్సర్ సైజ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News December 19, 2025

NTR: జిల్లా విద్యాశాఖ అధికారిణిగా ఎల్. చంద్రకళ

image

ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారిణిగా ఎల్. చంద్రకళ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో STU జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్. జార్జ్ వాషింగ్టన్, సభ్యులు, జిల్లా విద్యాశాఖ అధికారిణి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కతో అభినందనలు తెలియజేశారు. ఏ. కొండూరు మండలంలోని పాఠశాల అభివృద్ధికి సహకరించాలని, వారు కోరారు.