News December 28, 2025
పిఠాపురంలో రేపు యథావిధిగా పీజీఆర్ఎస్

పిఠాపురంలో ‘పాడా’ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాడా పీడీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్జీదారుల నుంచి విజ్ఞాపనలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.
Similar News
News January 7, 2026
వికారాబాద్‌లో ఎలక్షన్.. ఉత్కంఠ

పురపాలక ఎన్నికల కసరత్తు వేగవంతం కావడంతో ఆశావహుల్లో రిజర్వేషన్ల సెగ మొదలైంది. జిల్లాలోని తాండూరు(36), వికారాబాద్(34), పరిగి(18), కొడంగల్(12) మున్సిపాలిటీల్లోని 100వార్డుల అభ్యర్థులు తమ స్థానం ఏ క్యాటగిరీకి కేటాయిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఓటర్ల తుది జాబితా అనంతరం రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.
News January 7, 2026
మెదక్: కొత్త పథకం.. రూ.1,00,000 మీకోసమే!

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంతన్న కా సహారా మిస్కిన్ కోసం రెండు కొత్త పథకాల కోసం దరఖాస్తులను పునః ప్రారంభించిందని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు. మెదక్ జిల్లాలో ఉన్న ముస్లిం మైనార్టీస్ (ఫకీర్లు, దూదేకుల, దుర్బల ముస్లిం సమాజాలు) కులాల వారికి చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్ధిక పురోగతిని పెంపొందించడం ఈ పథకం ఉద్దేశమన్నారు.
News January 7, 2026
యాదాద్రి వద్దు.. చార్మినార్‌లో కలపాలి!

TGలో మరో ఉద్యమం ఉద్ధృతమవుతోంది. పోలీస్ నియామకాలలో జోన్‌ల వివాదం అగ్గి రాజేసుకుంటోంది. రాచకొండను యాదాద్రి జోన్‌లో ఉంచడం సిటీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయమని మండిపడుతున్నారు. సూర్యాపేట, NLG, యాదాద్రి జిల్లాల వల్ల కట్‌ఆఫ్ పెరిగి మేడ్చల్, RR అర్బన్ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి కొత్త కమిషనరేట్ కావడంతో, దీన్ని చార్మినార్ జోన్‌లో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.


