News June 18, 2024

పిఠాపురంలో హత్య..UPDATE

image

పిఠాపురం మండలం భోగాపురంలో ఈ నెల 14న బొమ్మ దేవప్రసాద్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు నాగులపల్లి పద్మరాజును అరెస్ట్ చేసినట్లు CI శ్రీనివాస్, SI గుణశేఖర్ తెలిపారు. మృతుని సోదరుడు శ్రీనివాసరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి హత్య కేసును విచారించామన్నారు. మృతుడు ప్రసాద్, నిందితుడు పద్మరాజు కలిసి తాపీ పని చేశారన్నారు. కూలి డబ్బుల విషయంలో జరిగిన ఘర్షణలో ప్రసాద్‌ను కొట్టి చంపేశారన్నారు.

Similar News

News January 24, 2026

గోదావరి పుష్కరాలకు ఇంకా 515 రోజులే: ఇన్ఛార్జి కలెక్టర్

image

2027 గోదావరి పుష్కరాలకు ఇంకా 515 రోజులే ఉన్నందున, చేపట్టాల్సిన పనులపై ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఇన్ఛార్జి కలెక్టర్ మేఘా స్వరూప్ అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం అమరావతి నుంచి సమీక్ష నిర్వహించారన్నారు. వీటిపై ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

News January 23, 2026

తూ.గో: ఉద్యోగాలకు 57 మంది ఎంపిక

image

కర్ణాటక రాష్ట్రం హోసూరు ప్రాంతంలోని టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో మొబైల్ ఆపరేటర్ పోస్టులకు తూ.గో జిల్లాకు చెందిన 57మంది ఎంపికయ్యారని ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై.మేఘా స్వరూప్ తెలిపారు. కలెక్టరేట్ వద్ద జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఈ అవకాశాలను అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 23, 2026

తూ.గో జిల్లా అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

తూర్పుగోదావరి జిల్లాల్లోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ మొదటి ఏడాది సీట్ల భర్తీకి దరఖాస్తులను తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 19లోపు https://apbragcet.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 1, 2 తేదీల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయి.