News March 14, 2025
పిఠాపురం: డూప్లికేట్ కాకుండా జనసేన మీడియా పాస్‌లు

మరికొద్ది గంటలో జనసేన ఆవిర్భావ సభ జరుగనుంది. అయితే కొంతమంది మీడియా ముసుగులో హడావుడి చేస్తున్నారు.ఈ నేపథ్యం పురస్కరించుకుని ఎలాంటి డూప్లికేట్ పాస్‌లు తయారు చేయకుండా ఉండేందుకు హాలోగ్రామ్‌తో కూడిన మీడియా పాసులు జారీ చేశారు. అక్రిడేషన్ కార్డులు ఉన్నవారికి మాత్రమే మీడియా పాస్ లిస్టు కలర్ జిరాక్స్ లేదా డూప్లికేట్ తయారు చేయకుండా హాలోగ్రామ్ పెట్టారు. దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
Similar News
News September 16, 2025
పాక్‌కు అవమానం.. మాట ప్రకారం తప్పుకుంటుందా?

IND vs PAK మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని PCB చేసిన <<17717948>>ఫిర్యాదును<<>> రిజెక్ట్ చేసినట్లు ICC అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆసియా కప్ నుంచి తప్పుకుంటామన్న పాక్‌కు ఘోర అవమానం ఎదురైంది. మొన్న గ్రౌండ్లో ప్లేయర్లకు, ఇప్పుడు ఆ దేశ బోర్డుకు భంగపాటు తప్పలేదు. మాట మీద నిలబడి టోర్నీ నుంచి తప్పుకుంటే పాక్‌కు కనీస మర్యాదైనా దక్కుతుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News September 16, 2025
నెల్లూరు: సాగు నీరు ముందుకెళ్లేది ఎలా?

అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. ప్రధాన ఆయకట్టు పంట కాలువల్లో గుర్రపు డెక్క పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో సాగు నీటికి ఆటంకంగా మారుతోంది. దీంతో సీజన్లో ఆయకట్టు పొలాలకు నీరు అందడం లేదు. జాఫర్ సాహెబ్ కాలువ, సర్వేపల్లి కెనాల్, కనుపూరు కెనాల్ పంట కాలువల్లో రబీ ఆరంభానికి ముందే పూడికతీత పనులు చేపట్టాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.
News September 16, 2025
విజయవాడలో 5 వేల మంది టీచర్లకు బస

మెగా డీఎస్సీ ఉద్యోగం సాధించిన నూతన టీచర్లకు ఈ నెల 19న అమరావతిలో భారీ బహిరంగ ఉంటుదని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జోన్ -1 పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి ఈ నెల 18 సాయంత్రానికి సుమారు 5 వేల మంది వస్తారని అంచనా. దీంతో 5 వేల మంది బస చేసేందుకు వీలుగా 13 పాఠశాలలను కేటాయించారు. మహిళలకు ప్రత్యేకంగా తరగతి గదులను సిద్ధం చేశారు.