News July 10, 2025

పిఠాపురం: పవన్ కళ్యాణ్ మంచి మనసు

image

పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ చిన్నారులకు అండగా ఉంటానని ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన హామీని నిలబెట్టుకుంటున్నారు. వరుసగా రెండో నెల కూడా తన జీతాన్ని చిన్నారుల సంక్షేమానికి కేటాయించారు. నియోజకవర్గంలోని 46 మంది పిల్లలకు ఒక్కొక్కరికీ రూ.5,000 చొప్పున మొత్తం రూ. 2.30 లక్షలను పంపిణీ చేయించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి్ మర్రెడ్డి శ్రీనివాస్ చిన్నారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ఈ నగదును అందజేశారు.

Similar News

News July 11, 2025

రష్మిక విలన్ రోల్ చేస్తోందా?

image

అల్లు అర్జున్-అట్లీ మూవీలో రష్మిక నటిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లని, అందులో రష్మిక ఒకరని సినీటౌన్‌లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే దీపికను హీరోయిన్‌గా పరిచయం చేశారు. మృణాల్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారని చెబుతున్నారు. మిగిలిన 3 పాత్రల్లో రష్మిక, జాన్వీ, భాగ్యశ్రీ పేర్లు వినిపిస్తున్నాయి. రష్మిక పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని, యాక్షన్ సీన్సూ చేస్తారని సమాచారం.

News July 11, 2025

NZB: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

image

నిజామాబాద్ మూడవ టౌన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు SI హరిబాబు గురువారం తెలిపారు. పంబౌలి ఏరియాలో గంజాయి విక్రయిస్తున్నారనే పక్క సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో షేక్ అఫ్రోజ్, షేక్ అయాజ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరు నుంచి 238 గ్రాముల గంజాయిని స్వాధీన పరుచుకొని, రిమాండ్‌కు తరలించారు.

News July 11, 2025

KMR: క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు ఎంపికలు

image

TG రాష్ట్ర క్రీడా అకాడమీల్లో ఈ ఏడాది ప్రవేశాలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి జగన్నాథన్ తెలిపారు. హాకీ, అథ్లెటిక్స్ (గచ్చిబౌలిలో బాలురు, బాలికలకు), హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్ అకాడమీలు (LB స్టేడియంలో బాలురకు మాత్రమే) ఈ ఎంపికలు జూలై 15, 16 తేదీల్లో ఉంటాయన్నారు.12 నుంచి 16 వయస్సు గల అర్హులైన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.