News February 9, 2025
పిఠాపురం: పాదగయలో జేడీ లక్ష్మీ నారాయణ పూజలు

పిఠాపురం దక్షిణ కాశీగా పిలవబడే పాదగయ క్షేత్రంలో మాజీ ఐఏఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కుక్కుటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించారు. అనంతరం రాజరాజేశ్వరి అమ్మవారు పురుహుతి అమ్మవారి ఆలయాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనాన్ని తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
Similar News
News February 28, 2026
గోల్డ్ లోన్ ఎప్పుడు తీసుకోవాలి?

మెడికల్ ఎమర్జెన్సీ, అత్యవసర బిజినెస్ అవసరాలు లేదా క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడే గోల్డ్ లోన్ తీసుకోవాలి. పర్సనల్ లోన్ దొరకని పరిస్థితుల్లో ఈ లోన్ బెస్ట్ ఛాయిస్. దీన్ని చాలా ఫాస్ట్‌గా ప్రాసెస్ చేస్తారు. సమయం తక్కువగా ఉన్నప్పుడు దీనికి మొగ్గు చూపాలి. నెలవారీ ఖర్చులు, వెకేషన్లు, లగ్జరీ వస్తువుల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టొద్దు. లేదంటే అధిక వడ్డీ భారంతో పాటు నగలను కోల్పోయే రిస్క్ ఉంటుంది.
News February 28, 2026
వైభవంగా భద్రాచల సీతారామ నిత్య కళ్యాణ వేడుక

భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు నిర్వహించారు.
News February 28, 2026
మద్దూర్ నగర్‌లో పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్

మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలులోని మద్దూర్ నగర్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను కలెక్టర్ స్వయంగా పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నగదు అందజేస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా సరైన సమయానికి పింఛన్ అందుతుందా అని లబ్ధిదారులను అడిగారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.


