News March 20, 2025
పిఠాపురం సభపై పవన్ కళ్యాణ్ ట్వీట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జయకేతనం సభ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. తన ‘x’ ఖాతా వేదికగా ..జనసేన పార్టీ సిద్ధాంతాలు ఇవే అంటూ ప్రకటన చేశారు. రాజకీయ కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాల అనంతరం సభా ప్రాంగణాన్ని శుభ్రపరిచి అందజేశామని అదే జనసేన సిద్ధాంతమని ఆయన పేర్కొన్నారు .
Similar News
News November 9, 2025
ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

<
News November 9, 2025
అయ్యప్ప దీక్షతో ఆరోగ్యం కూడా..

అయ్యప్ప దీక్ష 41 రోజుల పాటు ఉంటుంది. కానీ, దీని ప్రభావం ఆ భక్తులపై ఎప్పటికీ ఉంటుంది. ఈ దీక్ష ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే కాక శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తుంది. మెడలో రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం ధరించడం వలన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. 41 రోజుల ఈ సామాన్య జీవనం దీక్షానంతరం ఆదర్శవంతమైన ఆరోగ్యకర అలవాటుగా మారుతుంది. శబరిలో స్వామి దర్శనంతో దీక్ష ముగుస్తుంది, కానీ ఆరోగ్య జీవనశైలి మాత్రం కొనసాగుతుంది.
News November 9, 2025
GWL: టీబీ డ్యామ్ పరిధిలోని ఆయకట్టుకు క్రాఫ్ హాలిడే..!

తుంగభద్ర డ్యామ్‌కు కొత్త గేట్లు అమర్చేందుకు డ్యామ్ పరిధిలోని ఆయకట్టుకు ఈ ఏడాది రబీ లో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ విషయమై ఇటీవల కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే గతేడాది డ్యామ్ 19వ గేట్ కొట్టుకుపోగా స్టాప్ లాక్ గేట్ అమర్చారు. ఇంజినీరింగ్ నిపుణుల ఆదేశం మేరకు 33 కొత్త గేట్లు అమర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.


