News March 4, 2025
పిఠాపురం: 14న జనసేనలోకి పెండెం దొరబాబు?

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కుటుంబ సమేతంగా సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దొరబాబును జనసేనలో చేర్చుకునేందుకు పవన్ సముఖంగా ఉన్నారన్న నేపథ్యంలో ఆయన జనసేనలో ఎప్పుడు చేరుతారనేది పిఠాపురంలో హాట్ టాపిక్‌గా మారింది. దొరబాబు అనుచరులతో పెద్ద ఎత్తున పిఠాపురంలో మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలో పార్టీ చేరుతారని సమాచారం. దీనిపై అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Similar News
News March 4, 2025
KCRపై అనర్హత వేయాలని పిల్.. విచారణ వాయిదా

TG: KCR అసెంబ్లీకి రావడం లేదని దాఖలైన పిల్‌ను హైకోర్టు విచారించింది. ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయనకు సభలో ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన బాధ్యత ఉందని, సభకు రాని ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. దీనిపై తాము జోక్యం చేసుకోవచ్చా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. పిల్‌కు అర్హత లేదని అసెంబ్లీ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు వినిపించేందుకు పిటిషనర్ గడువు కోరడంతో 2 వారాలకు వాయిదా పడింది.
News March 4, 2025
మెదక్: చెల్లని ఓట్లతో అభ్యర్థుల్లో ఆందోళన !

కరీంనగర్‌లో పట్టభద్రుల MLCఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నిన్నటి నుంచి చెల్లిన, చెల్లని ఓట్లు వేరు చేసి తాజాగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. హోరాహోరీగా సాగిన పోలింగ్‌లో తొలి ప్రాధాన్య ఓట్లతో గెలుపు కష్టమేనని పలువురు అంటున్నారు. చెల్లని ఓట్లు అధికంగా కనిపించడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేసింది. ఈ ఓట్లతో ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్ ఉందని, ఎవరికి నష్టం కలిగిస్తాయో అన్న టెన్షన్ మొదలైంది.
News March 4, 2025
WGL: పెరిగిన మొక్కజొన్న, తగ్గిన పల్లికాయ ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు చిరుధాన్యాలు తరలివచ్చాయి. ఈ క్రమంలో మొక్కజొన్న, పల్లికాయ ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు(బిల్టి) క్వింటాకు సోమవారం రూ.2,355 పలకగా.. నేడు రూ.2,360కి పెరిగింది. అలాగే పచ్చి పల్లికాయ క్వింటాకి నిన్న రూ.5,500 ధర రాగా.. నేడు రూ.5,600 పలికింది. సూక పల్లికాయకి నిన్న రూ.7,500 ధర, నేడు రూ.6900కి పడిపోయింది.