News June 29, 2024

పిఠాపురానికి పవన్‌.. తరలనున్న ప.గో జిల్లా నేతలు

image

డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌ కళ్యాణ్‌ జులై 1న తొలిసారి పిఠాపురం రానున్నారు. తనను గెలిపించిన ప్రజలకు అభినందనలు తెలపనున్నారు. ఉప్పాడ సెంటర్‌లో జరిగే వారాహి సభలో పవన్‌ ప్రసంగిస్తారు. 3రోజుల పాటు ఆయన పిఠాపురంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అటు వారాహి సభకు ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల నుంచి జనసేన నేతలు, అభిమానులు భారీగా తరలి రానున్నట్లు సమాచారం. ఏర్పాట్లపై కాకినాడ కలెక్టర్ షన్మోహన్‌ శుక్రవారం సమీక్షించారు.

Similar News

News November 17, 2024

ప్రభుత్వ అరాచకాలపై సంక్రాంతి తర్వాత ప్రణాళిక: మాజీ మంత్రి కారుమూరి

image

రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో పాటు అరాచకాలపై వైసీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి తర్వాత ప్రత్యేక ప్రణాళిక చేయనున్నట్లు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం తణుకు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు.

News November 17, 2024

దేవరపల్లి: కార్తీకమాసంలో చికెన్ ధరలు ఇలా

image

ప.గో జిల్లాలోని పలు ప్రాంతాలలో చికెన్ పై శ్రావణమాసం ఎఫెక్ట్ పడుతోంది. అయితే జిల్లాలో పలుచోట్ల ధరలు తగ్గితే .. కొన్నిచోట్ల మాత్రం సాధారణంగానే ఉన్నాయి. కాగా దేవరపల్లి మండలంలోని దుద్దుకూరు గ్రామంలో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. కేజీ ఫారం మాంసం రూ. 200గా ఉంది, బ్రాయిలర్ రూ. 220 ఉంది. అయితే కార్తీకమాసం కావడంతో వినియోగదారులు తక్కువగా ఉన్నారని వ్యాపారస్థులు చెబుతున్నారు.

News November 17, 2024

తాడేపల్లిగూడెంలో ఎయిర్ పోర్ట్

image

రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, అందులో పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం ఒకటి. ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం ఆ ప్రాంతంలో 1,123 ఎకరాలను గుర్తించింది. పారిశ్రామిక , వ్యాపార , పర్యాటకం ఇలా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.