News March 19, 2025
పిడుగురాళ్ల: అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన కమిషనర్

పిడుగురాళ్ల పట్టణ పరిధిలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్‌ను మంగళవారం పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. క్యాంటీన్ పరిధిలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. భోజనం విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు తమ దృష్టికి తీసుకొని రావాలన్నారు. అనంతరం ప్రజలతో కలిసి క్యాంటీన్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
రోజూ గంట నడిస్తే.. ఇన్ని లాభాలా?

నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. రోజులో గంటసేపు నడిస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి వివరించారు. *రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. *ఒత్తిడి తగ్గుతుంది. *మానసిక స్థితి మెరుగవుతుంది.
*రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలోకి వస్తాయి. *పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. *మనసు ప్రశాంతంగా ఉంటుంది. *డోపమైన్ (హ్యాపీ హార్మోన్) పెరుగుతుంది. అందుకే నడవడం మొదలుపెట్టండి. SHARE IT
News September 17, 2025
తెలంగాణ విమోచన వేడుకల్లో రాజ్ నాథ్ సింగ్

TG: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై.. జాతీయ జెండాను ఎగుర వేస్తారు. ఆయన నిన్న సాయంత్రమే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
News September 17, 2025
ASF: గంజాయి సాగు.. పదేళ్ల జైలు శిక్ష

గంజాయి సాగు చేసిన నిందితుడికి ASF జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వాంకిడి ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాలు.. వాంకిడి మండలం సోనాపూర్‌కి చెందిన జంగు 2022లో అక్రమంగా గంజాయి మొక్కలను సాగు చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం జిల్లా కోర్టులో నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి రమేశ్ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు తెలిపారు.