News February 7, 2025

పిడుగురాళ్ల: ఐదు నెలల తర్వాత రీపోస్టు మార్టం  

image

గత ఏడాది మృతిచెందిన మారం పున్నమ్మ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన పిడుగురాళ్ల బెల్లంకొండ డొంక పొలంలో గురువారం జరిగింది. ఎస్ఐ మోహన్ కథనం ప్రకారం.. మృతిచెందిన పున్నమ్మ కుమారుడు ఫిర్యాదు మేరకు రీపో స్టుమార్టం నిర్వహించాల్సి వచ్చిందని అన్నారు. కోర్టు ఆదేశాలతో పొలంలో ఉన్న సమాధిని తవ్వి మృతదేహాన్ని వెలికి తీసి, తహశీల్దార్ మధుబాబు పర్యవేక్షణలో రీ పోస్టు మార్టం నిర్వహించారు.  

Similar News

News February 7, 2025

వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే పత్తి ధర ఈరోజు రూ.10 పెరిగింది. గురువారం రూ.6,970 పలికిన పత్తి ధర.. నేడు రూ.6,980 చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ వారం మొదటి నుంచి క్రమంగా పత్తి ధరలు చూస్తే.. సోమవారం రూ.7 వేలు మంగళవారం రూ.6,960, బుధవారం రూ.6,980, గురువారం రూ.6,970 పలికాయి.

News February 7, 2025

ట్రాన్స్ జెండర్‌ను లవ్ చేసిన యువకుడు.. అనుమానాస్పద మృతి

image

2 రోజుల క్రితం పురుగు మందు తాగిన తెలంగాణ రాష్ట్రం గద్వాల పట్టణం చింతలపేటకు చెందిన నవీన్(25) కర్నూలులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఓ ట్రాన్స్‌జెండర్‌ను నవీన్ ప్రేమించాడని, ఆ కమ్యూనిటీ వారే యువకుడిని గాయపరచడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని కాలనీవాసులు చర్చించుకుంటున్నారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇవాళ గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 7, 2025

విద్యార్థులను అభినందించిన జిల్లా ఎస్పీ

image

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జరిగిన స్కౌట్స్ అండ్ గైడ్స్ డైమండ్ జూబ్లీ జంబోరి వేడుకలలో పాల్గొని ప్రతిభ చూపిన జిల్లా స్కౌట్ విద్యార్థులను అన్నమయ్య ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అభినందించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయన ప్రశంసించారు. మున్ముందు మరింత ప్రతిభ చూపి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

error: Content is protected !!