News September 4, 2025

పిడూరుమిట్టలో విషాదం.. నిమజ్జనోత్సవంలో బాలుడు మృతి

image

మనుబోలు మండలం పిడూరుమిట్టలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నన్నూరు జస్వంత్ కుమార్ (16) పది చదువుతున్నాడు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలో వినాయక బొమ్మను ఏర్పాటు చేసి బుధవారం ఉదయం బొమ్మను సముద్రంలో నిమజ్జనం చేయుటకు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం శ్రీనివాస సత్రంనకు బయలుదేరి వెళ్లారు. సముద్రంలో నిమజ్జనం చేస్తుండగా జస్వంత్ కుమార్ పడిపోయి చనిపోయాడు. ఎస్సై శివ రాకేశ్ విచారణ చేపట్టారు.

Similar News

News September 4, 2025

నెల్లూరు జిల్లాలో ముగ్గురు టీచర్లకు అవార్డులు

image

టీచర్స్ డే సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించింది. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. బుచ్చిరెడ్డిపాలెం(M) పెనుబల్లి MPPSలో SGTగా పనిచేస్తున్న CHచెన్నయ్య, ఇందుకూరుపేట MKR ప్రభుత్వ జూ.కాలేజ్ లెక్చరర్ డొమినిక్‌రెడ్డి, అదే మండలంలోని నరసాపురం ZP హైస్కూల్ పీడీ ముజీర్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. విజయవాడలో వీళ్లు అవార్డులు అందుకుంటారు.

News September 4, 2025

ముఖ్యమంత్రిని కలిసిన ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ మాలపాటి

image

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కలిశారు. దగదర్తి రాచర్లపాడు ఛానల్ పనులలో అక్రమాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 23వేల ఎకరాల పంట బీడు భూములుగా మారుతున్నాయని రైతులకు అన్యాయం జరుగుతుందని వివరించారు. ముఖ్యమంత్రి వెంటనే విచారణ జరిపి న్యాయం చేస్తానని తెలిపినట్లు ఆయన వివరించారు.

News September 4, 2025

RRR స్కీమ్ ద్వారా అభివృద్ధి: నెల్లూరు కలెక్టర్

image

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ (రిపేర్‌, రెనోవెషన్‌, రెస్టోరేషన్‌) స్కీం ద్వారా జిల్లాలో జలవనరులను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ బుధవారం అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి అమలు, పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. పంటలకు నీటిని సమృద్ధిగా అందించేందుకు, భూగర్భజలాలు పెంచడమే RRR లక్ష్యమన్నారు.