News June 22, 2024
పితాని సత్యనారాయణ అనే నేను

ఆచంట MLAగా పితాని సత్యనారాయణ అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం ప్రొటెం స్పీకర్‌ను కలిసి కరచాలనం చేశారు. శుక్రవారం అనివార్య కారణాల వల్ల పితాని అసెంబ్లీకి వెళ్లని విషయం తెలిసిందే.
Similar News
News December 29, 2025
కలెక్టరేట్‌లో 221 అర్జీలపై కలెక్టర్ ఆరా!

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 221 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 29, 2025
ప.గో: కారుమూరితో సహా 13 మందిపై కేసులు

మాజీ మంత్రి కారుమూరి వెంక నాగేశ్వరరావుతో సహా 13 మందిపై తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈనెల 25న తణుకు మండలం తేతలి వై జంక్షన్ సమీపంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద ప్లెక్సీల ఏర్పాటుపై జరిగిన వివాదంలో పోలీసులు, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వీరిపై 189(2), 329(2), 223(a) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణకుమార్ తెలిపారు.
News December 29, 2025
ప.గో: ఓ వైపు బరులు.. మరోవైపు వినతులు

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ నేపథ్యంలో పలుచోట్ల కోడి పందేల నిర్వహణకు బరులను సిద్ధం చేస్తున్నారు. అధికారిక అనుమతులు రాకముందే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే వీరవాసరం, ఆకివీడు, భీమవరం మండలాల్లో పందేలను నివారించాలంటూ స్థానికులు అధికారులకు వినతిపత్రాలు అందజేస్తుండటం గమనార్హం. ఓవైపు పందేలకు సన్నాహాలు, మరోవైపు ప్రజల అభ్యంతరాలు కొనసాగుతున్నాయి.


