News April 19, 2025
పినపాక: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం- సీతారాంపురం గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహన ఢీకొని సీతారాంపురంకి చెందిన కోడి రెక్కల నరసింహ(60) మృతి చెందాడు. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
Similar News
News April 20, 2025
రాజంపేట: ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతి

రాజంపేటలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గుడి తండాకి చెందిన మాలోత్ అనిత, గణేశ్‌ల చిన్న కుమారుడు చిన్నా శనివారం సాయంత్రం ఇంటి ముందు స్నేహితులతో కలసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ట్రాక్టర్ గేర్లను మార్చగా న్యూట్రల్‌లోకి వెళ్లింది. వెనక పల్లంగా ఉండటంతో ట్రాక్టర్ టైర్ చిన్నాపై నుంచి వెళ్లింది. గాయపడిన చిన్నాను కామారెడ్డి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News April 20, 2025
కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు

కార్పొరేట్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని నల్గొండ సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు ప్రేమ్ కరణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత ప్రమాణాలతో బోధన సాగిస్తూ కాంపిటిటీవ్ పరీక్షల్లో ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణత సాధిస్తున్న కళాశాలలకు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
News April 20, 2025
నెల్లిమర్ల ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం..?

నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ బంగారు సరోజినీపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు జోరుగా చర్చ సాగుతుంది. ప్రస్తుతం ఈమె జనసేనలో ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే కౌన్సిలర్లు చర్చించినట్లు సమాచారం. పొత్తులో ఉన్న TDP, జనసేన సఖ్యత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మొత్తం 20 వార్డుల్లో TDPకి 7, YCPకి 9, BJPకి 1, జనసేనకు 3 చొప్పున సభ్యుల బలం ఉంది. సభ్యులు సహకరిస్తే TDPకి ఛైర్మన్ దక్కే అవకాశం ఉంది.