News February 6, 2025

పిన్నెల్లి అనుచరుణ్ని కోడి మాంసం పట్టించింది 

image

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడు తురక కిషోర్ సినీ ఫక్కిలో హైదరాబాద్‌లో కొద్దిరోజుల క్రితం పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్న కిషోర్ కోడి మాంసం కోసం తన మొబైల్ నుంచి ఫోన్ పే వాడుతూ ఉండడం గుర్తించారు. పోలింగ్ రోజున అల్లర్లు, దాడులు, పాత కేసులు, తీవ్ర నేరారోపణలున్న కిషోర్‌ను హైదరాబాద్ జైపూరి కాలనీలో చికెన్ స్టాల్ వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నారు.

Similar News

News February 6, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.250 పెరిగి రూ.79,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.270 పెరగడంతో రూ.86,510 పలుకుతోంది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. వివాహాలు ఉండటంతో కొనుగోలుదారులకు ఇది మరింత భారం కానుంది.

News February 6, 2025

‘లైగర్‌’లో నటించేందుకు అనన్య ఒప్పుకోలేదు: చంకీ పాండే

image

విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాలో నటించేందుకు తన కూతురు అనన్య పాండే అసౌకర్యంగా ఫీలైనట్లు ఆమె తండ్రి చంకీ పాండే తెలిపారు. ఆ పాత్రకు ఆమె వయసు సరిపోదని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే తానే ఒప్పించినట్లు వెల్లడించారు. కాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు కరణ్ జోహర్ ఓ నిర్మాతగా వ్యవహరించారు.

News February 6, 2025

కామారెడ్డి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయాలని తీర్మానం

image

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెంటనే అరెస్టు చేయాలని కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం గ్రామ రెడ్డి సంఘం ప్రతినిధులు తీర్మానం చేశారు. బీబీపేట మండలం యాడారం గ్రామంలో రెడ్డి కులస్థులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతినిధులు బాపురెడ్డి, నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అగ్రవర్ణ కులాలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

error: Content is protected !!