News October 30, 2024
పిన్నెల్లి బెయిల్ షరతులపై ముగిసిన వాదనలు
ఎన్నికల సమయంలో నమోదైన కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ షరతులను సడలించాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా, పోలీసుల తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేయడంతో మంగళవారం వాదనలు ముగిశాయి. నవంబర్ 4వ తేదీన తీర్పు వెలువరిస్తామని న్యాయస్థానం తెలిపింది. సింగపూర్‌లో కుమారుడి విద్యాభ్యాసం కోసం తాను వెళ్లాల్సి ఉందని తన పాస్‌పోర్ట్ వెనక్కి ఇప్పించాలని కోరారు.
Similar News
News October 30, 2024
గుంటూరు: శాస్త్రవేత్త రామారావు కన్నుమూత
గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మొవ్వ రామారావు(90) మంగళవారం తెనాలిలో అనారోగ్యంతో కన్నుమూశారు. లాంగ్ ఫామ్‌లో సుదీర్ఘకాలంగా పనిచేయడంతో పాటు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యుడిగా కూడా వ్యవహరించారు. వేమూరు మండలం జంపనిలో 1935, జూన్ 4వ తేదీన మధ్యతరగతి కుటుంబంలో రామారావు జన్మించారు. నవంబర్ 1న అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News October 30, 2024
బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడగింపు
గుంటూరులో ఓ వ్యక్తిని రూ.50లక్షలు ఇవ్వాలని బెదిరించిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో విచారణ అనంతరం పోలీసులు అనిల్‌ను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ను నవంబర్ 12వ తేదీ వరకు పొడిగించింది. దీంతో పోలీసులు తిరిగి అనిల్‌ను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.
News October 29, 2024
ప్రత్తిపాడు: తండ్రిని హత్య చేసిన కొడుకు
ప్రత్తిపాడు మండలం చిన్న కొండ్రుపాడులో మంగళవారం వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి-కొడుకుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కుమారుడు చేతిలో తోక వెంకటరామయ్య(60) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.