News December 25, 2025

పిన్నెల్లి సోదరులకు జనవరి 7 వరకు రిమాండ్

image

గుండ్లపాడు జంట హత్య కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులకు జనవరి 7 వరకు రిమాండ్ పొడిగించారు. నెల్లూరు జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి లను మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి వర్చువల్‌గా విచారించి రిమాండ్‌ను పొడిగించారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ6గా, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఏ7గా ఉన్నారు.

Similar News

News December 29, 2025

పోలవరం జిల్లాలో ముఖ్య నేతలు వీరే.!

image

పోలవరం జిల్లాలో ముఖ్య నేతలుగా స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి ఉండనున్నారు. ఎమ్మెల్యే అసెంబ్లీ స్థానాన్ని ప్రస్తుతం ప్రభుత్వం జిల్లాగా మార్చింది. ఆమెతో పాటు జిల్లాలో కీలక నాయకులుగా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ చోళ్ల బోజ్జిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నాగులపల్లి ధనలక్ష్మి, వంతల రాజేశ్వరి, చిన్నం బాబు రమేశ్, సీతంశెట్టి వెంకటేశ్వరరావు, కోసూరి కాశీవిశ్వనాథ్ రెడ్డి ఉండనున్నారు.

News December 29, 2025

విజయ్ హజారేలో హైదరాబాద్ బే‘జారే’!

image

విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ మూడో సారి ఓటమి పాలైంది. సోమవారం జరిగిన గ్రూప్-B మ్యాచ్‌లో అస్సాం 4 వికెట్ల తేడాతో HYDను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అస్సాంలో శిబ్‌శంకర్ రాయ్ (112) మెరుపు సెంచరీ చేశాడు. సౌరవ్ (91) పరుగులతో రాణించాడు. దీంతో లక్ష్యాన్ని ASM 49.3 ఓవర్లలో సాధించి విజేతగా నిలిచింది.

News December 29, 2025

పశుసంవర్ధక రంగంతో ఆర్థిక పురోగతి: కలెక్టర్

image

పశుసంవర్ధక రంగాన్ని మరింత బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను స్థిరపరచవచ్చని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం పార్వతీపురం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు సంబంధిత శాఖలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు సమాచారాన్ని వేగంగా చేరవేయడానికి AI వంటి ఆధునిక కృత్రిమ మేథస్సును వినియోగించాలని సూచించారు.