News February 9, 2026
పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు: రజిని

నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డిలను మాజీ మంత్రి విడదల రజిని సోమవారం పరామర్శించారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతోనే వారిపై అక్రమ కేసులు బనాయించి 61 రోజులుగా జైల్లో ఉంచిందని ఆమె విమర్శించారు. పోలీసులు ఐదుసార్లు బెయిల్‌ను అడ్డుకోవడం దారుణమని, వారు ఏ తప్పూ చేయలేదని రజిని స్పష్టం చేశారు. ఎంతటి వేధింపులకు గురిచేసినా భయపడకుండా న్యాయపోరాటం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News April 14, 2026
ADB: పెళ్లి సంబరాలు కావద్దు విషాదం..!

ఆదిలాబాద్ జిల్లాలో పెళ్లిల జోరు కొనసాగుతోంది. దీంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సామూహికంగా వెళ్తుంటారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో పరిమితికి మించి లారీలు, ట్రాక్టర్లు వంటి వాహనాల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఇటీవల సిరికొండ మండలానికి చెందిన వాహనం నిర్మల్ సమీపంలో ప్రమాదానికి గురై ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే.
News April 14, 2026
ఖమ్మం జిల్లాలో పెరిగిన కూలీ రేట్లు

ఖమ్మం జిల్లాలో సుతారీ మేస్త్రీలు, సహాయ కార్మికుల కూలీ రేట్లు పెంచుతూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. సోమవారం బిల్డర్స్ అసోసియేషన్, కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మేస్త్రీ కూలీ రూ.950 నుంచి రూ.1,050కు, సహాయకుల కూలీ రూ.670 నుంచి రూ.735కు పెంచినట్లు డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
News April 14, 2026
కడప: స్పోర్ట్స్ కోటా టీచర్లకు తిరుపతిలో రేపు సమావేశం

మెగా డీఎస్సీ 2025లో స్పోర్ట్స్ కోట ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల 15న తిరుపతిలో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ మంగళవారం తెలిపారు. కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు డీఎస్డీవో/డీఎస్ఏ కార్యాలయం, తిరుపతిలో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. విద్యాశాఖ మంత్రి ప్రత్యేక సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు.


