News December 1, 2025
పిన్నెల్లి సోదరుల కేసుపై సుప్రీం కోర్టు ఆగ్రహం

పల్నాడు జంట హత్యల కేసులో పోలీసుల విచారణలో నమోదైన 161 వాంగ్మూలాలు నేరుగా నిందితులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడి చేతికి చేరడంతో సంచలనం రేగింది. ఈ పత్రాలను సుప్రీం కోర్టులో సమర్పించడంతో ధర్మాసనం తీవ్రంగా మండిపడి, ఇవెలా లీకయ్యాయో ప్రశ్నించింది. ముందస్తు బెయిల్‌ను తిప్పికొట్టి, ఇద్దరూ రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. రికార్డుల లీకేజీపై ఉన్నతాధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
Similar News
News December 1, 2025
స్టీల్ ప్లాంట్ ఘటనపై విచారణకు ఏఐటీయూసీ డిమాండ్

విశాఖ స్టీల్ ప్లాంట్ కన్వేయర్ బెల్ట్ ఘటనపై సీఎండీని విధుల నుంచి దూరంగా ఉంచి, నిపుణులతో జాయింట్ విచారణ జరిపించాలని ఏఐటీయూసీ నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. యాజమాన్యం లోపం వల్లే బెల్టు తెగిందని, ఉద్యోగులపై నిందలు వేయడం తగదని జిల్లా కార్యదర్శి జి.ఎస్.జె.అచ్యుత రావు మండిపడ్డారు. తప్పుడు మరమ్మతుల వల్లే ప్రమాదం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.
News December 1, 2025
WhatsApp: కొత్త నిర్ణయంతో తిప్పలు తప్పవు!

కేంద్రం తెస్తున్న <<18424391>>‘సిమ్ బైండింగ్’<<>> రూల్ కొందరు వాట్సాప్ యూజర్లపై ప్రభావం చూపనుంది. ఏ నంబర్‌తో యాప్ వాడితే సిమ్ ఆ మొబైల్‌లో ఆన్‌లో ఉండాలనే రూల్‌తో ఫారిన్ ట్రిప్స్ వెళ్లే వారికి, సిమ్ లేని వారికి ఇబ్బందే. ప్రస్తుతం ఆఫీస్ నంబర్‌తో లింకైన అకౌంట్లు మల్టిపుల్ డివైజ్‌లలో లాగిన్‌లో ఉంటాయి. కానీ ప్రతి 6గం.కు వెబ్ వర్షన్స్ ఆటో- లాగౌట్ నిర్ణయంతో రి-లాగిన్, చాట్స్ లోడింగ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్.
News December 1, 2025
ఆ వ్యాధి గురించి భయపడకండి: చిత్తూరు DMHO

చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు స్కబ్ టైపన్ కేసులు 149 నమోదయ్యాయని.. అందరూ కోలుకున్నారని DMHO సుధారాణి వెల్లడించారు. చిన్న నల్లి లాంటి ప్రాణి కుట్టడంతో ఈ వ్యాధి వస్తుందన్నారు. తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు ఉంటాయని తెలిపారు. బురదలో నడిచినప్పుడు, పొలాల్లో చెప్పులు లేకుండా తిరిగినప్పుడు ఇవి కుడుతాయన్నారు. జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే యాంటి బయోటిక్స్ ద్వారా నయమవుతుందని స్పష్టం చేశారు.


