News January 13, 2026

పిల్లలకు భోగి పళ్లు పోస్తున్నారా?

image

ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రదోష వేళలో తూర్పు ముఖంగా కూర్చోబెట్టి భోగి పళ్లు పోయాలని పండితులు సూచిస్తున్నారు. తల్లి మొదట భోగి పళ్లతో బిడ్డకు 3 సార్లు సవ్యంగా, 3 సార్లు అపసవ్యంగా దిష్టి తీసి ఆపై తల మీద నుంచి పోయాలి. ఇలా చేస్తే నరదోషం తొలగిపోతుందని, నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. చివరగా పిల్లలకు హారతివ్వాలి. భోగి పళ్లలో ఏమేం ఉండాలి? ఎందుకు పోయాలి? భోగి మంటల ఆవశ్యకత కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

Similar News

News February 22, 2026

భారత్ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం MOU

image

AP: భారత్ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, CM CBN సమక్షంలో MOU జరిగింది. MOUపై భారత్ నెట్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ నెట్ అందించే లక్ష్యంగా ఒప్పందం చేసుకున్నట్లు CM వెల్లడించారు. రాష్ట్రంలోని 13,426 పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందిస్తామన్నారు. మరో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు.

News February 22, 2026

బుల్లెట్ తగిలినా తగ్గలేదు!

image

జమ్మూకశ్మీర్ కిష్త్వార్ జిల్లాలో ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో టైసన్ అనే శునకం ధైర్యసాహసాలు ప్రదర్శించింది. దాని సహాయంతో పోలీసులు, భద్రతా దళాలు జైషే మహమ్మద్ ఉగ్రమూకలను గుర్తించగలిగారు. ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో టైసన్ గాయపడింది. అయినా ఓర్పుతో మిషన్ పూర్తయ్యేవరకు సేవలు అందించింది. గాయపడిన శునకాన్ని హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

News February 22, 2026

మరో రెండు రోజుల్లో ఇరాన్‌పై అమెరికా దాడి?

image

ఇరాన్‌పై మరో రెండు రోజుల్లో అమెరికా దాడి చేసే అవకాశం ఉందని CIA మాజీ అధికారి జాన్ కిరియాకౌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై US ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తనకు సమాచారం అందిందన్నారు. ఇరాన్‌కు 10రోజుల గడువు ఇవ్వడం కేవలం దృష్టి మరల్చడానికేనని అన్నారు. అమెరికా సైన్యం కదలికలు ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తున్నాయి. బహ్రెయిన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాల్లోని అమెరికా స్థావరాలు అప్రమత్తమయ్యాయి.