News March 7, 2025
పిల్లలతో అన్నమయ్య ఎస్పీ

‘మహిళల అభివృద్ధి, సాధికారత, సమానత్వం కోసం కృషి చేద్దాం’ అని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. మహిళల భద్రత, రక్షణ, సమానత్వం, అభివృద్ధి, సాధికారత కోసం కృషి చేయాలన్న సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.
Similar News
News March 7, 2025
గౌతాపూర్ మాజీ సర్పంచ్ మృతి

బాలానగర్ మండలంలోని గౌతాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మల్లెకేడి యాదగిరిజీ అనారోగ్యంతో ఉస్మానియా ఆసుపత్రిలో గురువారం మృతి చెందారు. ఈయన 2009-2014 వరకు గ్రామ సర్పంచిగా పనిచేశాడు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరి.. 2014 ఆగస్టులో ఎంపీటీసీగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివిధ పార్టీల చెందిన నాయకులు సంతాపం తెలిపారు.
News March 7, 2025
WGL: రెండో 153 మంది విద్యార్థులు ఆబ్సెంట్

వరంగల్ జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రెండవ రోజు ప్రశాంతంగా ముగిశాయి. పేపర్ ఏ సెట్ వచ్చింది. రెండవ రోజు మొత్తం 5626కి 5473 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 153 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయినట్లు అధికారులు తెలిపారు. మాల్ ప్రాక్టీస్ కింద ఎవరు దొరకలేదని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
News March 7, 2025
నాగర్ కర్నూల్: గుర్తు తెలియని మహిళ మృతి

బిజినేపల్లి మండలం పోలేపల్లి గ్రామ శివారులోని కేఎల్ఐ కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ విషయాన్ని గురువారం స్థానికులు పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. మహిళ ఎవరు? ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.