News December 23, 2025

పిల్లలను అమ్మే ముఠా కోసం 5 ప్రత్యేక బృందాలతో సిట్ ఏర్పాటు

image

విజయవాడలో పిల్లలను అమ్మే ముఠా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో లోతైన విచారణ కోసం నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేశారు. అడ్మిన్ డీసీపీ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక బృందాలతో సిట్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ముంబైతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విచారణ చేపట్టేందుకు సిట్‌ను నియమించామన్నారు.

Similar News

News December 27, 2025

కరీంనగర్: పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా

image

2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన లెప్రసీ, పల్స్‌ పోలియో బిల్లులను చెల్లించాలని శనివారం కరీంనగర్‌ కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆశావర్కర్లు ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేశ్‌ మాట్లాడుతూ.. ఈ బిల్లులపై డీఎంహెచ్‌ఓ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆశావర్కర్లకు రూ.18 వేల వేతనం చెల్లించాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించే వరకు పోరాడుతామన్నారు.

News December 27, 2025

మేడారం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎస్పీ

image

మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ రాత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో చర్చించి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. జాతర పనులను పూర్తి చేసి సౌకర్యాలు మెరుగుపరచాలని అధికారులకు ఆదేశించారు

News December 27, 2025

వరంగల్‌లో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయండి: ఎంపీ

image

వరంగల్ నగరంలో మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఎంపీ కడియం కావ్య కోరారు. ఆయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్‌కు ఆమె లేఖ రాశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో రోజుకు 400 టన్నుల వ్యర్థాలు వస్తున్నాయని, పర్యావరణ పరిరక్షణకు ఈ ప్లాంట్ ఎంతో అవసరమన్నారు. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాక, స్వచ్ఛమైన ఇంధనం అందుబాటులోకి వస్తుందని ఆమె వివరించారు.