News April 9, 2025
పిల్లలు గొడవ పడుతున్నారని తల్లి ఆత్మహత్యాయత్నం

పిల్లలు గొడవ పడుతున్నారన్న మనస్థాపంతో ఓ మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుర్రం కొండకు చెందిన లక్ష్మీదేవి పిల్లలు మధ్యాహ్నం గొడవ పడుతుండగా వెళ్లి వారిని వారించింది. తల్లి మాట వినకుండా గొడవ పడుతుండడంతో మనస్థాపం చెంది నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, వెంటనే మదనపల్లికి తరలించారు.
Similar News
News April 18, 2025
తరచూ జలుబు వేధిస్తోందా?

సీజన్లతో సంబంధం లేకుండా కొందరిని తరచూ జలుబు వేధిస్తుంటుంది. దీనికి శరీరంలో అయోడిన్ లోపం కారణమై ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరికొందరిలో మాటిమాటికీ వచ్చే ఆవలింతలకు కారణం ఐరన్ లోపం అని అంటున్నారు. అలాగే, కాళ్లు, చేతుల కండరాల్లో రెగ్యులర్‌గా నొప్పులు వస్తుంటే శరీరంలో మెగ్నీషియం తక్కువైందని గుర్తించాలంటున్నారు. వెన్ను, కాళ్ల నొప్పులొస్తే విటమిన్-D టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.
News April 18, 2025
సూర్యాపేట: పొలం కోయిస్తుండగా కనిపించిన మృతదేహం

వరి పొలంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపిన ఘటన మునగాలలో గురువారం చోటుచేసుకుంది. మునగాలకు చెందిన తూముల వీరస్వామి పొలంలో హార్వెస్టర్‌తో పొలం కోయిస్తుండగా మృతదేహం కనిపించడంతో భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే వీరస్వామి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.
News April 18, 2025
? ప్లేస్‌లో ఉండాల్సిన నంబర్ ఏంటి?

పై ఫొటోలో ఉన్న రీజనింగ్ క్వశ్చన్ చూశారు కదా! చిన్న లాజిక్ ఉపయోగిస్తే దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ? ప్లేస్‌లో ఉండాల్సిన నంబర్ ఏంటో కనుగొంటే COMMENT చేయండి.