News September 9, 2025

పిల్లలు వెళ్లాల్సింది బడికి.. పనికి కాదు: వరంగల్ పోలీసులు

image

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు పిలుపునిచ్చారు. ‘పిల్లలు వెళ్లాల్సింది బడికి.. పనికి కాదు’ అనే సందేశంతో అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. బాలల హక్కులను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఎక్కడైనా బాలకార్మికులపై సమాచారం లభిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కి చెప్పాలరి పోలీసులు కోరారు. చిన్నారుల భవిష్యత్తు కోసం సమాజం మొత్తం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Similar News

News September 9, 2025

మునిపల్లి: గురుకుల పాఠశాలను పరిశీలించిన ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల పాఠశాలలో హాస్టల్ గోడ కూలిన ఘటనలో ముగ్గురు (3) విద్యార్థులు స్వల్ప గాయాల పాలైన ఘటనపై ఎస్పీ పారితోష్ పంకజ్ స్పందించారు. ఈ సందర్భంగా ఘటన స్థలాన్ని పరిశీలించి హాస్టల్ విద్యార్థులను తాత్కాలికంగా వేరే ప్రాంతానికి తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గాయపడ్డ చిన్నారులను ఆసుపత్రిలో పరామర్శించారు.

News September 9, 2025

సిర్పూర్: తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్: ఆర్ఎస్పీ

image

ముఖ్యమంత్రి తెలంగాణ రైసింగ్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు కానీ తెలంగాణ రైసింగ్ కాదు తెలంగాణ ఫాలింగ్ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ అన్నారు. మంగళవారం సిర్పూర్ మండలం చిన్నమాలిని గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి సీతక్క సిర్పూర్ రోడ్లను ఎందుకు పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందన్నారు.

News September 9, 2025

కవిత TDPలోకి వస్తారా? లోకేశ్ ఏమన్నారంటే..

image

కల్వకుంట్ల కవిత టీడీపీలోకి వస్తారా? అనే ప్రశ్నకు నారా లోకేశ్ స్పందించారు. ‘కవితను టీడీపీలోకి తీసుకోవడం అంటే జగన్‌ను టీడీపీలో చేర్చుకోవడం లాంటిది’ అని వ్యాఖ్యానించారు. తాను KTRను వివిధ సందర్భాల్లో కలిశానని, అందులో తప్పేంటని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. NDA అభ్యర్థికి ఓటు ఎందుకు వేశారో జగన్‌ను అడగాలని మీడియా చిట్‌చాట్‌లో అన్నారు.